అధికారుల సంఘం.. సమరానికి సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

అధికారుల సంఘం.. సమరానికి సన్నద్ధం

Mar 15 2026 4:54 AM | Updated on Mar 15 2026 4:54 AM

● రెండేళ్ల పీఆర్‌పీ వెంటనే చెల్లించాలి ● కోలిండియా పాలసీ అమలు చేయాలని డిమాండ్‌ ● రెండేళ్ల పీఆర్‌పీ చెల్లించాలి. ఖాళీగా ఉన్న డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీచేయాలి. ● న్యాయబద్ధమైన పదోన్నతి పాలసీ అమలు చేయాలి. ఫీల్డ్‌లో పనిచేస్తున్న అధికారులకు సౌకర్యాలు ఆధునీకరించాలి. ● పారదర్శకమైన బదిలీపాలసీ అమలు చేయాలి. ఆసుపత్రి సౌకర్యాలు ఆధునీకరించాలి. రిటైర్డ్‌ అధికారులకు మెడికల్‌ కార్డులు అందించాలి. ● కోలిండియాలోని పదోన్నతి పాలసీ సింగరేణిలో అమలు చేయాలి. డిసిగ్నేషన్స్‌ కేటాయించాలి. అధికారులకు ఉచిత విద్యుత్‌, ఐఐటీ ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి. ● డీఏ 50శాతం దాటిన క్రమంలో బోర్డు తీర్మానం మేరకు రూ.25లక్షల గ్రాడ్యుటీ సీలింగ్‌ అమలు చేయాలి.

గోదావరిఖని(రామగుండం): సమస్యల సాధనకు సింగరేణి అధికారులు సమరానికి సమాయత్తమవుతున్నారు. సంస్థ వ్యాప్తంగా ఉన్న 2,300 మంది అధికారులు సమస్యలపై ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఆదివారం గోదావరిఖని బీగెస్ట్‌ ఆవరణలోని సీఎంఓఏఐ కార్యాలయంలో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నారు. అధికారులకు రావాల్సిన రెండేళ్ల పెర్ఫామెన్స్‌ రిలేటెడ్‌ పే(పీఆర్‌పీ), కోలిండియాలో మాదిరిగా జీతాలు అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు పలు సమస్యలపై సింగరేణి కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(సీఎంఓఏఐ) ఆందోళనకు సిద్ధమవుతోంది. అధికారుల సమస్యల సాధనలో సీఎంఓఏఐ నాయకత్వం పలు దఫాలుగా యాజమాన్యం దృష్టికి తీసుకవస్తూనే ఉంది. గతంలో రిలేనిరాహార దీక్షలు చేపట్టి ఆందోళనలు ఉధృతం చేస్తున్న క్రమంలో అప్పటి సీఎండీ బలరాం అధికారులతో చర్చించి ఆందోళన విరమింపజేసేలా చేశారు. తర్వాత సీఎండీ మారడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగింది. ఈక్రమంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న సీఎండీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

ప్రధాన డిమాండ్‌లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement