నియోజకవర్గ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

Mar 15 2026 4:54 AM | Updated on Mar 15 2026 4:54 AM

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ కింద 238 మంది లబ్ధిదారులకు శనివారం రూ.75,88,000 విలువగల చెక్కులు అందజేసి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో దాదాపు రూ.వెయ్యికోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రాష్ట్రస్థాయిలోనే పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. మున్సిపల్‌ చైర్మన్లు నూగిల్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, మార్కెట్‌ చైర్మన్‌ కూర మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

మంథని: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేశ్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం స్థానికంగా ఓ గార్డెన్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకుని తమ ప్రాంతానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదల వెంకన్న, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, ఎస్సై రమేశ్‌ ఉన్నారు.

18న రంజాన్‌ అడ్వాన్స్‌

గోదావరిఖని(రామగుండం): ముస్లింలకు రంజాన్‌ పండుగ అడ్వాన్స్‌ చెల్లించేందుకు యాజ మాన్యం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న కార్మికుల ఖాతాల్లో సొమ్ము జమచేయనున్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులకు రూ.25వేలు, బదిలీ వర్కర్లు, ట్రెయినీలకు రూ.12,500 చొప్పున సంస్థ చెల్లించనుంది.

మున్సిపల్‌ సేవలు భేష్‌

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణంలో మున్సిపాలన బాగుందని, మినీటాంకుబండ్‌పై ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు అధికారుల ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని రీజినల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ షాహిద్‌ మసూద్‌ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లిలో శనివారం నర్సరీ, టాంకుబండ్‌ను సందర్శించి పనులను పర్యవేక్షించారు. ఆర్‌డీఎంఏను చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య, కమిషనర్‌ వెంకటేశ్‌ సత్కరించారు. మేనేజర్‌ లింగయ్య, ఏఈ సతీశ్‌, టీపీవో నరేశ్‌, ఏవో నాగవేణి, రమాకాంత్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement