ముంచుకొస్తున్న గడువు
కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిలు ఆశించిన మేరకు వసూలు కావడంలేదు. 2025–26 ఆర్థిక సంవత్సరం గడువు ముంచుకొస్తున్నా వసూళ్లలో వేగం పుంజుకోవడం లేదని తెలుస్తోంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది నిమ గ్నం కావడం వసూళ్లపై ప్రభావం చూపింది. గడు వు మరో 35 రోజులే మిగిలిఉంది. దీంతో ఆస్తిపన్ను వసూళ్లలో అధికారులు వేగం పెంచారు. బకాయిదారులకు రెడ్‌నోటీసులు జారీ చేయడంతోపాటు ప్ర త్యేక బృందాలను రంగంలోకి దింపడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని బల్దియాల్లో 77,040 అసెస్మెంట్ల నుంచి రూ.33.44 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటివరకు రూ.19.31కోట్ల వరకు వసూలు చేశారు.
పెద్దపల్లి బల్దియా వెనుకంజ
రామగుండం నగరంలో రూ.19.63 కోట్ల డిమాండ్ ఉండగా, ఇందులో రూ.12.82 కోట్లు వసూల య్యాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో రూ.2.59కోట్ల డిమాండ్ ఉంటే రూ.1.38 కోట్లు, మంథని బల్దియాలో రూ.2.46కోట్ల డిమాండ్ ఉంటే రూ.1.27కోట్లు వసూలయ్యాయి. పెద్దపల్లిలో రూ.8.75కోట్ల డిమాండ్ ఉండగా, ఇప్పటివరకు రూ.3.82 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
వేగం పెంచడానికి ప్రణాళిక
మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లలో వేగం పెంచడానికి కొత్త పాలకవర్గాలు, కమిషనర్లు దృష్టి సారించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు బకాయిదారులకు రెడ్‌నోటీసులను జారీ చేయడానికి నివేదికలు తయారు చేస్తున్నారు. రామగుండంలోని 60 డివిజన్లకు 25 మంది వార్డుఆఫీసర్లు ఉండగా, ఒక్కోవార్డు ఆఫీసర్‌కు రెండు డివిజన్ల చొప్పున కేటాయించారు. ఆస్తిపన్ను వసూలుకు ఒక్కొక్కరికి ఇప్పటివరకు ఒక హ్యాండ్ మిషన్ ఉండగా, మరో 25 మిషన్లు తెప్పించి రెండే సి చొప్పున కేటాయించనున్నారు. అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు డివిజన్లలో పర్యటిస్తున్నారు.
ఆస్తిపన్నే ఆదాయం
బల్దియాలకు పన్నుల రూపంలో సమకూరే ఆదాయాన్ని పాలకవర్గం సూచనల మేరకు అధికారులు వ్యయం చేస్తారు. రోడ్ల మరమ్మతు, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, పారిశుధ్య కార్మికులకు పనిముట్లు కొనుగోలు, కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాల చెల్లింపు తదితర వాటికి ఈ నిధులు వెచ్చిస్తారు.
మంగళవారం వరకు
బల్దియాల్లో వసూలైన
ఆస్తిపన్ను
ఆస్తిపన్ను వసూలులో కనిపించని పురోగతి
వెనుకబడిన పెద్దపల్లి మున్సిపల్ అధికారులు
రెడ్‌నోటీసుల జారీకి సిద్ధమవుతున్న యంత్రాంగం
బల్దియా అసెస్మెంట్లు డిమాండ్ వసూలు శాతం (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
రామగుండం 53,098 19.64 12.84 65.39
పెద్దపల్లి 13,158 8.75 3.82 43.65
సుల్తానాబాద్ 5.500 2.59 1.38 53.28
మంథని 5,284 2.46 1.27 60


