అభివృద్ధికి సహకరించండి
నగర కార్యకలాపాల నిర్వహణకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. అవుట్‌సోర్సింగ్ వర్కర్ల జీతాలు, వీధిదీపాలు, విద్యుత్ వినియోగ చార్జీలకు ఇందులో నుంచే చెల్లించాలి. మరోనెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. నగరవాసులు ఆ స్తిపన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలి.
– మహంకాళి స్వామి,
మేయర్, రామగుండం కార్పొరేషన్
ఆస్తిపన్ను వసూలుపై ఫోకస్
రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుపై ఫోకస్ పెట్టాం. ప్రతీరోజు సమీక్షిస్తున్నాం. వాటర్ ట్యాక్స్‌ను కూడా ఆన్‌లైన్ చేశాం. ప్రస్తుతానికి ఆస్తిపన్ను వసూలులో పురోగతి ఉంది. మొండిబకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేస్తాం. భారీ బకాయిదారుల ఆస్తులు సీజ్ చేస్తాం.
– అరుణశ్రీ, అదనపు కలెక్టర్
అభివృద్ధికి సహకరించండి


