హెల్మెట్ ధరించాలి
గోదావరిఖని: సురక్షిత ప్రయాణం కోసం ద్విచక్రవాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబ ర్ కిశోర్‌ఝా సూచించారు. స్థానిక మున్సిపల్ టీ జంక్షన్ వద్ద మంగళవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి వచ్చినవారికి పుష్పాలు అందించి అభినందించారు. పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని, ట్రాఫిక్ ఏసీపీలు రమేశ్, శ్రీనివాస్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, రాజేశ్వరరావు, అనిల్‌కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నేరాలను నియంత్రించాలి
సాంకేతిక ఆధారాలతో నేరాలను నియంత్రించాలని సీపీ అంబర్ కిశోర్‌ఝా అన్నారు. తన కార్యాలయంలో జరిగిన జనవరి నెల నేరసమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్)శ్రీనివాస్, ఏసీపీలు రమేశ్, ప్రకాశ్, కృష్ణ, రవికుమార్, వెంకటేశ్వర్లు, వెంకటరంగారెడ్డి పాల్గొన్నారు.
సీపీఆర్‌పై అవగాహన
పెద్దపల్లి: సీపీఆర్‌పై అవగాహన కల్పించేందు కు మార్చి 2 నుంచి జూన్ 9వ తేదీ వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ సూచించారు. ఆర్‌బీఎస్‌కే డాక్టర్లు, సిబ్బందికి మంగళవారం జిల్లా కేంద్రంలో సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, వందరోజుల ప్రణాళికలో భాగంగా పాఠశాల ఆధారిత ఆరోగ్య కార్యకలాపాలకు సన్నద్ధత కల్పించామన్నారు. ఆర్‌బీఎస్‌కే బృందాలు అ న్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. డాక్టర్ నిస్సీ క్రిస్టియనా, డిప్యూ టీ డీఎంహెచ్‌వో శ్రీరాములు, ప్రోగ్రాం అధికా రి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్‌లో ఎమ్మెల్యే ఠాకూర్
గోదావరిఖని: సంఘటన సృజన్‌అభియాన్‌లో పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎ మ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగియోజకవర్గంలోని పూడూ రు మండలం మిర్జాపూర్‌లో నిర్వహించిన కా ర్యక్రమం సందర్భంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, నాయకులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అరుణాచలానికి ఆర్టీసీ బస్సు
గోదావరిఖనిటౌన్: అరుణాచలం, రామేశ్వరం పుణ్యక్షేత్రాలకు గోదావరిఖని నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. మార్చి 8న మధ్యాహ్నం ఒంటిగంటకు గోదావరిఖని నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. యాత్ర లో కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళ ని, మధురై, రామేశ్వరం, విష్ణుకంచి, శివకంచి, జోగులాంబ పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుందని, అదేనెల 14న గోదావరిఖని చేరుకుంటుంద ని వివరించారు. వివరాలకు 73828 47596, 70135 04982 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
క్వింటాల్ పత్తి రూ.7,464
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,464 ధర పలికిందని మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.5,707గా, సగటు రూ.7,053గా ధర ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 221మంది రైతులు తీసుకొచ్చిన 561 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు వారు వివరించారు.
హెల్మెట్ ధరించాలి
హెల్మెట్ ధరించాలి


