నేటినుంచి ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 25 2026 10:32 AM | Updated on Feb 25 2026 10:32 AM

నేటినుంచి ఇంటర్‌ పరీక్షలు

నేటినుంచి ఇంటర్‌ పరీక్షలు

● పరీక్షల్లో పిల్లలు రాణించే తొలిబాధ్యత వారిదే. పరీక్షలకు సిద్ధం చేయడం, సులువుగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వడం ముఖ్యం. పరీక్ష బాగా రాయలగలవని చెప్పి మనోధైర్యం నింపాలి. పరీక్షకు ముందురోజే అవసరమైన వస్తుసామగ్రి సర్దిపెట్టాలి. కాటన్‌ దుస్తులు దరింపజేయాలి. పరీక్ష రాసి ఇంటికి వచ్చాక నీరసం తొ లగేలా చల్లనిపానీయం అందించాలి. టీవీలు, మొబైల్‌ఫోన్లు వాడుతూ ఇబ్బంది కలిగించొద్దు. ఇతరులతో పోల్చుతూ ఆత్మన్యూనతకు గురిచేయొద్దు. ఉలిక్కిపడి నిద్రలేచేలా కొట్టడం, తిట్టడం చేయరాదు. చదువు విషయంలో విద్యార్థులు అలసిపోయేలా సూచనలు చేయొద్దు. పిల్లల్లో అనారోగ్య లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులకు చూపించాలి. ● ముఖ్యంగా తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు పరీక్షల్లో విజయం సాధిస్తారు. పరీక్షలు పిల్లలకే కాదు.. తల్లిదండ్రులకూ అనే విషయాన్ని మర్చిపోవద్దు. పిల్లల్లో మానసిక ఒత్తిడి, కడుపునొప్పి, తలనొప్పి, ఆందోళన లాంటివి కనిపిస్తే వారిని ఓదార్చాలి. తగిన మందులు, ధైర్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ చదువేకాకుండా మధ్యలో విరామం ఇవ్వాలి. సరదా కబుర్లు చెప్పాలి. సాయంత్రం వేళ కాసేపు బయట అడుకునేలా ప్లాన్‌ చేయాలి. వారితో కలిసి ఆడాలి. తద్వారా పిల్లల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం కాసేపు యోగా, ధ్యానం వంటివి చేయించాలి. అదేపనిగా సలహాలు, సూచనలు ఇస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది. ● పిల్లల్ని పరీక్ష కేంద్రాలకు తీసుకువెళ్లే ముందు వాహనంలో ఇంధనం సరిచూసుకోవాలి. రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి. నిర్దేశిత సమయానికి అర్ధగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రం నుంచి బయటకు రాగానే సాధించే మార్కులపై ప్రశ్నిస్తూ విసిగించరాదు. తర్వాతిరోజు పరీక్షపై ఏకాగ్రత ఉండే లా ప్రోత్సహించాలి. పరీక్షవేళ శుభకార్యాలు, తీర్థయాత్రల ప్రస్తావన తీసుకు రావొద్దు. సమయపాలన ఆవశ్యకతపై వారికి వివరించాలి.

జ్యోతినగర్‌(రామగుండం): జిల్లాలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. పరీ క్షల సమయం సమీపించడంతో విద్యార్థుల్లో ఆందో ళన, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రాల కు తీసుకువెళ్లే తల్లితండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల్లో మానసిక ప్రశాంతత నింపాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో కొన్ని..

పిల్లలకు ఆదిగురువు అమ్మే

సమస్యలు గుర్తించాలి

ఇవి మర్చిపోవద్దు

ఒత్తిడిని జయిస్తేనే విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement