రాజన్నా.. పల్లెకు ఒకసారి రావాలె..
మంథనిరూరల్: ఉద్యమం కోసం ఊరికి దూరమై ఐ దు దశాబ్దాలపాటు అజ్ఞాతంలో సాయుధ పోరుచే సి మంగళవారం హైదరాబాద్‌లో డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ స భ్యుడు మల్లా రాజిరెడ్డి ఉరఫ్ సంగ్రామ్ రాకకోసం ఆయన స్వగ్రామమైన మంథని మండలం ఎగ్లాస్ పూర్ పంచాయతీ పరిధిలోని శాస్త్రులపల్లి గ్రామస్తు లు ఆశతో ఎదురుచూస్తున్నారు. అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలోకి వస్తున్నాడనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. లొంగుబాటు సమాచారం తె లుసుకునేందుకు టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. తాము చిన్నతనంలో చూశామని, ఆ త ర్వాత కనిపించలేదని చెప్పారు. ఆనాడు అడవిలోకి వెళ్లిన రాజిరెడ్డి ఇప్పటి వరకు తిరిగి రాలేదన్నారు. రాజన్న ఎప్పుడైనా రాకపోతాడా, తాము చూడకపోతమా అని ఎదురుచూశామని వివరించారు. ఉద్యంలోకి వెళ్లక ముందు ఊరిలో ఏ ఒక్కరిని పల్లెత్తుమా ట అనేవాడు కాదని, దొరల ఫీలింగ్ కూడా ఏమీ ఉండేది కాదని, అందరితో కలివిడిగా ఉండేవారని తెలిపారు. ఐదు దశాబ్దాలు గడుస్తున్నా ఒక్కసారి కూడా పల్లెకు రాలేదని అంటున్నారు.
రాజిరెడ్డిని చూసి ఐదు దశాబ్దాలు
ఇన్నేళ్లలో ఒక్కసారైనా వస్తడని అనుకున్నం
మావోయిస్ట్ ‘మల్లా’ రాకకోసం శాస్త్రులపల్లివాసుల ఎదురుచూపు
రాజన్నా.. పల్లెకు ఒకసారి రావాలె..
రాజన్నా.. పల్లెకు ఒకసారి రావాలె..


