సమస్యల స్వాగతం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపల్ కొత్త పాలకవర్గం బుధవారం నుంచి పాలన ప్రారంభించనుంది. మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య సారథ్యం వహిస్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీని సాధించడం, ఎమ్మెల్యే విజయరమణారావు.. చైర్మన్‌గా నూగిల్ల మల్లయ్య పేరును ఖరారు చేయడంతో ఎన్నిక సాఫీగానే ఏకగ్రీవమైంది. ఈనెల 16న పదవీ ప్రమాణస్వీకారం చేసిన పాలకమండలి బుధవారం కొలువుదీరనుంది.
పాలకుల ఎదుట అనేక సమస్యలు
పెద్దపల్లి పట్టణం అనూహ్యంగా జిల్లా కేంద్రంగా అవతరించింది. కానీ ఆ హోదాకు తగిన విధంగా ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. తొలికలెక్టర్ అలుగు వర్షిణి పట్టణ రూపురేఖలు మార్చాలనే సదాశయంతో ఆరు ప్రధాన కూడళ్లను ఎంపికచేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూ పొందించారు. ఓ అధికారుల బృందాన్ని ముంబ యి, కోల్‌కతా లాంటి నగరాలకు పంపించి అక్కడి నమూనాలతో నిర్మించేలా సుభాష్‌విగ్రహం వద్ద ఫౌంటేన్ ఏర్పాటు చేయించారు. ఇంతలోనే ఆమె బదిలీ కావడంతో మిగతా పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల అమర్‌నగర్ కూడలిని ఆధునికీకరించారు. ప్రధాన జెండాకూడలి, చాకలి ఐల మ్మ, బస్టాండ్, ప్రగతినగర్ కూడళ్ల సుందరీకరణకు కొత్తపాలకవర్గం చొరవ చూపాల్సి ఉంది.
శివారుకాలనీల్లో మురుగు సమస్య
కొత్తగా వెలుస్తున్న శివారు కాలనీలు, ఖాళీ ప్లాట్లలో మురుగునీరు నిలుస్తోంది. దోమలు వృద్ధి చెంది స్థా నికులకు వ్యాధులను అంటగడుతున్నాయి. అధికారులు అప్పడప్పుడు యజమానులకు నోటీసులు ఇ చ్చినా పెద్దగా మార్పులేదంటున్నారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చిన రియల్టర్లు.. లేఅవు ట్ నిబంధనలు పాటించక ఇలాంటి పరిస్థితి దాపు రించిందంటున్నారు. కొత్తగా వెలుస్తున్న వెంచర్లు కూడా నిబంధనలు పాటించడం లేదని, కొత్త పాలకవర్గమైనా లేఅవుట్ నిబంధనలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
అడుగడుగుకో లీకేజీ
మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు తరచూ పగుళ్లు చూపుతున్నాయి. ప్రజలకు కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రమాదముంది. లీకేజీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది. కొన్నివీధుల్లో చిమ్మచీక ట్లు కమ్ముకుంటున్నాయని, శాంతినగర్, చీకురాయి రోడ్డు తదితర ప్రాంతాల్లో వీధిదీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నేటినుంచి కొత్త మున్సి‘పాలన’ షురూ


