సమ్మక్క హుండీ ఆదాయం రూ.57.74 లక్షలు | - | Sakshi
Sakshi News home page

సమ్మక్క హుండీ ఆదాయం రూ.57.74 లక్షలు

Feb 2 2026 7:13 AM | Updated on Feb 2 2026 7:13 AM

సమ్మక

సమ్మక్క హుండీ ఆదాయం రూ.57.74 లక్షలు

గోదావరిఖని: స్థానిక సమ్మక్క–సారలమ్మ జాతర హుండీ ఆదాయం రూ.57.74లక్షలు సమకూరినట్లు జాతర కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఈవో కాంతారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక బీ –గెస్ట్‌హౌస్‌ సారలమ్మ ఆలయ కా ర్యాలయం వద్ద హుండీ లెక్కించారు. హుండీ ద్వారా రూ.31.26లక్షలు, వేలం ద్వారా రూ. 19.89లక్షలు, టికెట్ల ద్వారా రూ.6,59లక్షలు సమకూరినట్లు వివరించారు. గతేడాదితో పోల్చితే ఈసారి రూ.8.86లక్షలు అదనంగా సమకూరాయని పేర్కొన్నారు. వీటితోపాటు 2.900 మిల్లి గ్రాముల బంగారం, 798 గ్రాముల వెండి సమకూరిందని అన్నారు. లెక్కింపులో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా ఎండోమెంట్‌ ఏసీ సుప్రియ, అధికారులు, ప్రతినిధుఉలు లక్ష్మి, శ్రీవెంకట అన్నమాచార్య, మమతారెడ్డి పాల్గొన్నారు. సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు చేపట్టారు.

నేటి ప్రజావాణి రద్దు

పెద్దపల్లి: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదివారం తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికారులు బిజీగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. జిల్లావాసులో సహకరించాలని ఆయన కోరారు.

అభివృద్ధిపై సీఎం మార్క్‌

పెద్దపల్లిరూరల్‌: సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతోనే నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నానని, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఒకేసారి నాలుగు పోలీస్‌స్టేషన్లను మంజూరు చేసిన ఘనత తనకే దక్కిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మున్సిపల్‌ అభ్యర్థులకు ఆయన బీ ఫామ్‌లు అందజేసి మాట్లాడారు. తనకు ఎలాంటి వ్యాపార వ్యవహారాలు లేవని, ప్రజాసేవ చేయాలన్న ధ్యాసే ఉందన్నారు. పెద్దపల్లిలో పదేళ్లపాటు కుటుంబపాలనే సాగిందని ఆయన విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన కోరారు. నాయకులు నూగిల్ల మల్లయ్య, సారయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

ప్రజాప్రభుత్వంతోనే అభివృద్ధి

గోదావరిఖని/జ్యోతినగర్‌: ప్రజాప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు. స్థానిక ఆర్యవైశ్య భవన్‌లో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎన్టీపీసీ 31, 33వ డివిజన్‌కు చెందిన పలువురు కూడా కాంగ్రెస్‌ పార్టీకండువా కప్పుకున్నారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ కారు వరుసగా పంక్చర్‌ అవుతోందని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఆ పార్టీ నాయకులు తమ పద్ధతులు మార్చుకోవాలని సూచించారు. పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సమ్మెకు సన్నద్ధం కావాలి

పెద్దపల్లి: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో సమ్మె ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగులు, కార్మికుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. దేశ సంపదను కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తూ, ప్రజలకు నష్టం కలిగిస్తోందని దుయ్యబట్టారు. దీనిని నిరసిస్తూ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని ఆయన కోరారు. నాయకులు వేల్పుల కుమారస్వామి, ఎరవెల్లి ముత్యంరావు, భిక్షపతి, మెండె శ్రీనివాస్‌, సారయ్య, కుమార్‌, వినేయ్‌, అరవింద్‌, ఎండీ యాకుబ్‌, శ్రీనివాస్‌, భూమయ్య, సందీప్‌ పాల్గొన్నారు.

సమ్మక్క హుండీ ఆదాయం రూ.57.74 లక్షలు 1
1/2

సమ్మక్క హుండీ ఆదాయం రూ.57.74 లక్షలు

సమ్మక్క హుండీ ఆదాయం రూ.57.74 లక్షలు 2
2/2

సమ్మక్క హుండీ ఆదాయం రూ.57.74 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement