కాలుష్యాన్ని తరిమికొట్టాలి
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో కాలుష్యం తీవ్రతరమవుతోంది. దుమ్ము, ధూళితోపాటు వాయు, నీటికాలుష్యం నగరవాసులకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖని సింగరేణి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఆదివారం డిబేట్ నిర్వహించారు. పలువురు స్థానికులు తమ అభిప్రాయాలు వెల్లడించా రు. ఎన్నికల వేళ హామీలకే పరిమితం కాకుండా, కాలుష్య నివారణపై స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని వారు కోరారు.
స్వచ్ఛమైన గాలితోనే ఆరోగ్యం
రామగుండం నగరవాసుల అభిప్రాయాలు
‘సాక్షి’ డిబెట్‌కు విశేష స్పందన


