జనరంజక బడ్జెట్
పెద్దపల్లిరూరల్: అన్నివర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా జనరంజకమైన బడ్జెట్‌ను కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆదాయపు పన్ను మినహాయింపు, విద్య, వ్యవసాయం, రవాణా, పారిశ్రామిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. మహిళా సంక్షేమానికి నిధులు భారీగా కేటాయించారు.
– మల్క కొమురయ్య, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఇన్‌కంట్యాక్స్ ఊసేలేదు
గోదావరిఖని: ఉపాధిహామీ నిధులు తగ్గించారు. కాంట్రాక్టు కార్మికుల ఊసేలేదు. సింగరేణి ఉద్యోగుల ఇన్‌కంట్యాక్స్ ప్రస్తావన లేదు. రైతులకు ఇచ్చిన హామీలు పట్టించుకోలేదు. బడాపారిశ్రామికవేత్తలు, వ్యాపారులకే బడ్జెట్ అనుకూలంగా ఉంది.
– తుమ్మల రాజారెడ్డి, సీపీఎం నేత
జనరంజక బడ్జెట్


