వనదేవతల వైభవం
గోదావరిఖనిలో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
గోదావరిఖనిలో సారలమ్మను గద్దెకు తీసుకొస్తున్న కోయపూజారులు
‘ఖని’లో గద్దెకు వస్తున్న అమ్మవారు
శివసత్తుల పూనకం
గోదావరిఖని/పెద్దపల్లిరూరల్: ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క – సారలమ్మ మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శివసత్తుల పూనకాలు, కోయ పూజారుల ప్రత్యేక పూజ లు, భక్తుల మొక్కులు జాతర ప్రాంగణాలను మా ర్మోగించాయి. తొలిరోజు సారలమ్మ అమ్మవారు గద్దెకు చేరుకున్నారు. గురువారం సమ్మక్క గద్దెకు వస్తారు. శుక్రవారం అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం గిరిజనదేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.
పోటెత్తిన గోదావరితీరం..
రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ తన సతీమణి మనాలీ ఠాకూర్ కలిసి రామగుండం నగర శివారులోని గోదావరి తీరంలో సమ్మక్క – సారలమ్మ జాతర వద్ద ప్రత్యేక పూజలు చేసి వేడుకలు ప్రారంభించారు. కోయ పూజారులు గద్దెల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నేతృత్వంగా ఏసీపీ రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భారీ బందోబస్తు చేపడుతున్నాయి. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, గర్రెపల్లి, నారాయణపూర్, తొగర్రాయి సమ్మక్క–సారలమ్మ జాతరలూ వైభవంగా ప్రారంభమైంది. కోయ పూజారులు సారలమ్మను గద్దెకు తీసుకొచ్చారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరారు.
గద్దెకు వచ్చిన సారలమ్మ
నేడు సమ్మక్క తల్లి రాక
గిరి‘జన’మహాజాతర ప్రారంభం
కోయ పూజారులతో ప్రత్యేక పూజలు
హాజరైన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోలివాడ, కొలనూర్, హన్మంతునిపేట, నీరుకుల్లలో పోటెత్తిన భక్తజనం
వనదేవతల వైభవం
వనదేవతల వైభవం
వనదేవతల వైభవం
వనదేవతల వైభవం


