కాంగ్రెస్‌ను నిలదీయాలి
● మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని: అసెంబ్లీ ఎన్నికలో హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రె స్ నాయకులను కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వస్తే ని లదీయాలని మాజీ ఎమ్మెల్యే కో రుకంటి చందర్ కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధాలు, మొసాలకు కేరాఫ్ కాంగ్రెస్ అని మండిపడ్డారు. అభయహస్తంకార్డు ప్రతీఇంటికి అందిస్తామని నమ్మబలికి.. గెలిచాకా మొండిచెయ్యి చూపించారన్నారు. 420 హామీలు, ఆ రు గ్యారెంటీలు ఇచ్చి 100రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వాటిఊసే ఎ త్తడం లేదన్నారు. మున్సిపల్ సిబ్బంది బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలనే తొలగించింద ని, కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. మూల విజయారెడ్డి, నడిపెల్లి అభిషేక్‌రావు, అయిలయ్యయాదవ్, మారుతి ఉన్నారు.


