ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
పెద్దపల్లిరూరల్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను బల్దియా అధికారులు బుధవారం విడుదల చేశారు. కమిషనర్ వెంకటేశ్.. మాస్టర్ ట్రెయినర్ కృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారులతో కలిసి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 30వ తేదీ వరకు 36 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తామని, 31న పరిశీలన ఉంటుందని, ఫిబ్రవరి 1న తిరస్కరణపై అప్పీలు చేసుకోవచ్చని, 2న పరిష్కారం ఉంటుందని, 3న మధ్యాహ్నం 3గంటల వరకు ఉపసంహరణ గడువు ఉంటుందని అధికారులు వివరించారు. అదేరోజూ పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని వారు వెల్లడించారు.
యువతకు ఉచిత శిక్షణ
పెద్దపల్లి: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కరీంనగర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నామని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకింగ్, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ తదితర ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారికోసం ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు http://tsstudycircle. co.in వెబ్‌సైట్‌లో ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేయాలన్నారు. ఫిబ్రవరి 8న కరీంనగర్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహిచి 100 మందిని ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 98852 18053 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
ఆధునికంగా తీర్చిదిద్దుతా
గోదావరిఖని: గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ను రాష్ట్రంలోనే అన్నిహంగులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని, దీనికోసం రూ.కోటి వెచ్చించేందుకై నా వెనుకాడేది లేదని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. సోషల్ మీడియా రాతలు, విషప్రచారాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. ప్రజలు విశ్వసించేలా వార్తలు, కథనాలు ఉండాలని సూచించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు దేవరనేని మాధవరావు, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బొంతల రాజేశ్, క్లబ్ ఫౌండర్లు అల్లెంకి లచ్చయ్య, వేల్పుల నారాయణ, నాయకులు మాదాసి రాంమూర్తి, పూదరి కుమార్, కాల్వ చంద్రశేఖర్‌రెడ్డి, శ్యాంసుందర్, కేఎస్ వాసు, జక్కం సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి
జ్యోతినగర్(రామగుండం): కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలని సీపీఐ(ఎంల్) మాస్‌లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ లేబర్‌గేట్ వద్ద కేంద్ర బుధవారం నిరసన తెలిపారు. గుమ్మడి వెంకన్న, ఇసంపల్లి రాజేందర్‌తో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. కార్మికులకు హక్కులు, రక్షణ లేకుండా పోతోందన్నారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసమే పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఆదివాసుల హక్కులు కాలరాస్తోందని మండిపడ్డారు. నాయకులు శంకర్, చంద్రన్న, భూషణం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కమిటీలో చోటు
జూలపల్లి(పెద్దపల్లి): ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తెలుకుంట ఉపసర్పంచ్ దావు సంపత్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పుల మహేశ్ బుధవారం నియామకపత్రం ఆందజేశారు. ఆయనను పలువురు అభినందించారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల


