రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కేసీఆరే..
పెద్దపల్లి: రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది బీఆర్‌ఎస్ అధినేత కేసీఆరేనని పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సుల్తానాబాద్‌లో బుధవారం జరిగిన పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఆయన మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు రూ.అరవై ఎనిమిది వేల కోట్ల అప్పులు ఉండగా, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, వడ్డీ నెలకురూ. 6,000 కోట్లు కట్టాల్సి వస్తోందని అన్నారు. స్థానిక ఎన్నికల మాదిరిగానే పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయ మని ధీమా వ్యక్తం చేశా రు. సమర్థత ఉన్నా.. టికెట్ రాకుంటే పార్టీ పదవులు, లేదా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధా న్యం ఇస్తామని, కాదని పోటీచేస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఒక్కోస్థానానికి పది మందికిపైగా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా.. సర్వే నివేదికల ప్రామాణికంగా టికెట్లు కేటాయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడారు. నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్‌రావు, ఈర్ల స్వరూప, సారయ్యగౌడ్, సాయిరి మహేందర్, చీకట్ల మొండయ్య, శ్రీగిరి శ్రీనివాస్, వేగోళం అబ్బయ్యగౌడ్, బిరుదు సమత, ఊట్ల వరప్రసాద్, శ్రీనివాస్, తొర్రి కొండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, రైస్‌మిల్లులకు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, వాటిని సవరించాలని రైస్ మిల్లర్స్ అసోసి యేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు మంత్రులకు వినతిపత్రం అందజేశారు.
మంత్రులు శ్రీధర్, జూపల్లి కృష్ణారావు


