మంథని.. అనేక ప్రత్యేకతలు
మంథని: ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంథని వేదాలకు పుట్టినిల్లు. వేయి ఏళ్లకుపైగా మహోన్నత చరిత్ర కలిగిన మంథని.. మంత్రపురిగానూ పేరుగాంచింది. దేశఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతోపాటు అనేకమందికి దేశ రాజకీయాల్లో గుర్తింపునిచ్చింది మంథని. వేదాలు, మేధావులకు నిలయంగా మారింది. ఆధ్యాత్మిక కేంద్రంగానూ గుర్తింపు పొందింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా వినాయకుని గుడి, దక్షిణ భారతదేశంలో ఏకై క పశ్చిమ ముఖ శివలింగం మంథనిలోనే దర్శనమిస్తాయి. అన్నిదేవతల ఆలయాలనూ పురాణకాలంలోనే నిర్మించారు. నియోజకవర్గ కేంద్రమైన మంథని గతంలో సమితిగా ఉండేది. ప్రస్తుతం పురపాలక సంఘం ఎన్నికలపై సర్వత్రా ఆసక్తినెలకొంది.


