ఓటుహక్కు వినియోగించుకోవాలి
ధర్మారం(ధర్మపురి): అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీవైవో వెంకటరాంబాబు కోరారు. జిల్లా యువజన వ్యవహారాల శాఖ, యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో మైభారత్, మై ఓటు అవగాహన ర్యాలీనిర్వహించారు. ఎంపీడీవో సుమలత, డీవైవో ర్యాలీ ప్రారంభించారు. వెంకటరాంబాబు మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో యువజన సంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. యువజన సంఘాల నాయకులు దాగేటి ఉదయ్‌కుమార్, ఆర్‌ఐ వరలక్ష్మి, ప్రోగ్రాం ఆర్గనైజర్ రేషవేణి మహేశ్, యువశక్తి యూత్ వెల్పేర్ అధ్యక్షుడు సిదార్థ, కార్యదర్శి సోను, ఇర్ఫాన్, ధీరజ్, రిషిరాకేశ్, నితన్‌రాజు, రాహుల్ పాల్గొన్నారు.


