ఎల్లమ్మకు బోనం మొక్కులు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మీర్జంపేటలో మంగళవారం గౌడ కులస్తులు ఎల్లమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. తలపై బోనాలు, శివసత్తుల పూనకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. అమ్మవారికి సారె, చీర, జాకెట్, గాజులు సమర్పించి ఒడిబియ్యం పోశారు. కల్లు, గుడాలు, బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించారు. తమ పిల్లాపాపలను చల్లంగా చూడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. సర్పంచ్ శైలజ, గౌడ సంఘం అధ్యక్షుడు ఉయ్యాల రవిందర్‌గౌడ్, జాతర కమటీ చైర్మన్ అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ ప్రభు త్వంతోనే అభివృద్ధి సాధ్యమని, తమ పార్టీ అభ్యర్థులనే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లాకేంద్రంతోపాటు సుల్తానాబాద్ శాసీ్త్రనగర్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరరం ఆయన మాట్లాడారు. వార్డుల్లో అభివృద్ధి కోసం స్థానిక నాయకులు తననే నేరుగా కలవాలని, ఇందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. సుల్తానాబాద్ 15వ వార్డు, బస్టాండ్ వెనకాల వీధిలో ఆయన పర్యటించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూడండి
సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును చూసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. పెద్దపల్లి మున్సిపల్ ఒకటోవార్డు(బంధంపల్లి)కి చెందిన పూరెళ్ల సుధాకర్, శైలజ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ ఈరబోయిన శ్రీనివాస్, మాదాసి రవి, తిరుపతి, కొలకాని రవి, నక్కశంకర్, మహేశ్ తదితరులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించాచి మాట్లాడారు.
ప్రజాధనం వృథా
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని, ప్రజాధనం వృథా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. మంగళవారం ఆయన నగరంలో పర్యటించారు. కూల్చివేతలు కమీషన్ల కోసమేనని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను వెంటనే పూర్తిచేయాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ప్రతీడివిజన్‌లో డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతులు, నల్లా కనెక్షన్ పనులు పూర్తిచేశామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి, కౌశిక హరి, నారాయణదాసు మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, ముద్దసాని సంధ్యారెడ్డి, సట్టు శ్రీనివాస్, అల్లం అయిలయ్య, ఆర్శనపల్లి శ్రీనివాస్, జిట్టవేని ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లమ్మకు బోనం మొక్కులు
ఎల్లమ్మకు బోనం మొక్కులు


