ప్రతిభచూపిన ఎడ్లబండి | - | Sakshi
Sakshi News home page

ప్రతిభచూపిన ఎడ్లబండి

Jan 28 2026 6:51 AM | Updated on Jan 28 2026 6:51 AM

ప్రతి

ప్రతిభచూపిన ఎడ్లబండి

జూలపల్లి(పెద్దపల్లి): పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన అమ్ముల మహేశ్‌ ఎడ్లబండి రాష్ట్రస్థాయి పోటీల్లో రెండోస్థానంలో నిలిచింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం మిట్టపెల్లి గ్రామంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీల్లో మహేశ్‌ ఎడ్లబండి అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. దీంతో నిర్వాహకులు రూ.20వేల నగదు, ప్రశంసాపత్రం అందజేశారు. విజేతను సర్పంచ్‌ తొగరు శ్రీనివాస్‌, పంచాయతీ పాలకవర్గం, కరాటే కోచ్‌ సంకెన్ల లక్ష్మణ్‌ అభినందించారు.

మట్టి లారీల అడ్డగింత

పాలకుర్తి(రామగుండం): జయ్యారం శివారు లోని గుట్టల నుంచి మట్టి తరలిస్తున్న లారీల ను సర్పంచ్‌ కాసర్ల కిరణ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. మూడురోజులుగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారని, దీంతో వే బిల్లులతో మట్టి తీసుకెళ్లేందుకు అనుమతించామని, అయినా, వే బిల్లులు లేకుండానే మట్టి తరలిస్తున్నారని సర్పంచ్‌ ఆరోపించారు. కలెక్టర్‌ ఆదేశాలతో తహసీల్దార్‌ సునీత ఘటనా స్థలానికి చే రుకున్నారు. మట్టి తరలించేందుకు వేబిల్లులు ఉండాలని నిర్వాహకులకు సూచించారు.

బ్యాంకు ఉద్యోగుల నిరసన

గోదావరిఖనిటౌన్‌/పెద్దపల్లి: వారంలో ఐదురోజుల పనిదినాల పద్ధతి అమలు చేయాలనే డిమాండ్‌తో గోదావరిఖని, పెద్దపల్లితోపాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ఆందోళనలు చేపట్టారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నాయకులు నరేశ్‌, సతీశ్‌, ఉదయ్‌కుమార్‌, దిలీప్‌, సాగర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జెండా చౌరస్తా నుంచి కమాన్‌ చౌరస్తా వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు సదానందం, శ్రీధర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

‘ఎల్లంపల్లి’ నీటి విడుదల

రామగుండం: సమ్మక్క – సారలమ్మ జాతర నేపథ్యంలో భక్తుల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మంగళవారం గోదావరిలోకి నీటిని వి డుదల చేశారు. ఈనెల 28వతేదీ నుంచి మూ డు రోజుల పాటు సుమారు 0.3 టీఎంసీలు వి డుదల చేస్తామని నీటి పారుదల శాఖ అధికారి బుచ్చిబాబు తెలిపారు. భక్తుల పుణ్యస్నానా లు, ఇతర అవసరాలకు నీరు ఉపయోగపడుతుందన్నారు. నీటి ఉధృతి దృష్ట్యా పశువుల కాపరులు గోదావరినది దాటొద్దని, రాకపోకలు సాగించరాదని ఆయన సూచించారు.

నియామకం

పెద్దపల్లి: తపస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షు లుగా దుగ్యాల శ్రీనివాస్‌రావు, దామరపల్లి జయపాల్‌రెడ్డి, ఎలగం కనకయ్య, రాజేశ్వర్‌రావును నియమించారు. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు, జయపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

క్వింటాల్‌ పత్తి రూ.8,011

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,011గా నమోదైంది. కనిష్టంగా రూ.6,088గా, సగటు రూ.7,661గా పలికిందని మార్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.

ప్రతిభచూపిన ఎడ్లబండి 
1
1/4

ప్రతిభచూపిన ఎడ్లబండి

ప్రతిభచూపిన ఎడ్లబండి 
2
2/4

ప్రతిభచూపిన ఎడ్లబండి

ప్రతిభచూపిన ఎడ్లబండి 
3
3/4

ప్రతిభచూపిన ఎడ్లబండి

ప్రతిభచూపిన ఎడ్లబండి 
4
4/4

ప్రతిభచూపిన ఎడ్లబండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement