భక్తులకు నిరంతర సేవలు | - | Sakshi
Sakshi News home page

భక్తులకు నిరంతర సేవలు

Jan 28 2026 6:51 AM | Updated on Jan 28 2026 6:51 AM

భక్తులకు నిరంతర సేవలు

భక్తులకు నిరంతర సేవలు

24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు

కరీంనగర్‌ డిప్యూటీ ఆర్‌ఎం భూపాల్‌రెడ్డి

పెద్దపల్లి: మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ 24 గంటలపాటు బస్సులు నడిపిస్తుందని కరీంనగర్‌ డిప్యూటీ ఆర్‌ఎం భూపాల్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో మేడారం వెళ్లేందుకు అందుబాటులో ఉంచిన బస్సులను ఆయన మంగళవారం పరిశీలించారు. భక్తుల ఏర్పాట్లు, ఆర్టీసీ సిబ్బందికి కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్లతోపాటు హైదరాబాద్‌, నర్సాపూ ర్‌, రంగారెడ్డి, మెదక్‌ డిపోల నుంచి కూడా ఆర్టీసీ బస్సులను పెద్దపల్లి ప్రాంతానికి కేటాయించారని అన్నారు. శనివారం వరకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తామని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పదేళ్ల వయసులోపు పిల్లలు తప్పిపోకుండా వారికి క్యూఆర్‌ కోడ్‌ బ్యాండ్‌లను చేతికి కట్టి పంపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భక్తులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించకుండా.. సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని ఆయన కోరారు.

అత్యవసర సేవలకు ఫోన్‌ నంబర్లు

గోదావరిఖని: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు జరిగే సమ్మక్క – సారలమ్మ జాతరలో అత్యవసర సేవల కోసం పోలీసులు, వివిధ శాఖల అధికారులు ఫోన్‌నంబర్లు విడుదల చేశారు. ఎవరికైనా, ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తినా వెంటనే ఆయా ప్రాంతాల్లోని ఫోన్‌నంబర్లను సంప్రదించి సాయం పొందాలని అధికారులు సూచించారు.

గోదావరిఖని : గోదావరిబ్రిడ్జి

గోదావరిఖని ఏసీపీ : 87126–56515

గోదావరిఖని టూటౌన్‌ : 87126–56520

గోలివాడ జాతర:

అంతర్గాం ఎస్‌హెచ్‌వో : 87126–56527

తక్కళ్లపల్లి జాతర:

బసంత్‌నగర్‌ హెడ్‌కానిస్టేబుల్‌87125–80960

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement