రామగుండంలో 8 నామినేషన్ కేంద్రాలు
● ఏర్పాట్లు పూర్తిచేసిన బల్దియా అధికారులు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్‌లో నామినేషన్ల స్వీకరణకు 8 నామినేషన్ కేంద్రాలను సిద్ధం చేశారు. బుధవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ నామినేషన్ స్వీకరణ కేంద్రాల వివరాలు ప్రకటించారు. ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు.
డివిజన్ల వారీగా నామినేషన్ కేంద్రాలు
● రామగుండం : ముబారక్‌నగర్ జెడ్పీ హైస్కూల్ : 25, 26, 27, 28 29, 30
● టీటీఎస్ : జెడ్పీ హైస్కూల్ : 1, 33, 21, 22, 23, 24, 31, 32, 48, 49
● సప్తగిరికాలనీ : ప్రభుత్వ డిగ్రీ కాలేజీ : 2, 34, 3, 35, 4, 7, 5, 6
● అశోక్‌నగర్ : జెడ్పీ హైస్కూల్, ఉర్దూ మీడియం : 46, 47, 50, 51, 58, 60, 59
● గాంధీనగర్ : సింగరేణి కమ్యూనిటీ హాల్: 8, 9, 10, 38, 36, 37, 39, 40
● జవహర్‌నగర్ : సింగరేణి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ : 11, 12, 41, 54, 42, 43, 52, 53
● తిలక్‌నగర్ : సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్: :13, 44, 45, 57, 55, 56
● యైటింక్లయిన్‌కాలనీ : ఎన్‌సీవోఏ క్లబ్ : 14, 15, 16, 17, 18, 19, 20
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలోనే..
పెద్దపల్లిరూరల్: మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉన్నాయి. ఇందుకోసం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోనే అధికారులు మూడు నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటో నంబరు కేంద్రంలో 1 నుంచి 12వ వార్డు వరకు, రెండో నంబరులో 13 నుంచి 24వ వార్డు వరకు, మూడోనంబరు కేంద్రంలో 25వ వార్డు నుంచి 36వ వార్డుకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. అయితే, అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సాగర్ రోడ్డు నుంచే మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాలని సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావు సూచించారు. ఈమేరకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్‌తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు.


