టౌన్‌ మున్సిపాలిటీ నుంచి.. | - | Sakshi
Sakshi News home page

టౌన్‌ మున్సిపాలిటీ నుంచి..

Jan 28 2026 6:51 AM | Updated on Jan 28 2026 6:51 AM

టౌన్‌ మున్సిపాలిటీ నుంచి..

టౌన్‌ మున్సిపాలిటీ నుంచి..

మంథని: సుమారు 56 ఏళ్లక్రితం టౌన్‌ మున్సిపాలిటీగా ఉన్న మంథని.. మేజర్‌ పంచాయతీగా, మున్సిపాలిటీగా అవతరించింది. 1953లో టౌన్‌ మున్సిపల్‌గా మారిన తర్వాత డిసెంబర్‌ 21న తొలిఅధ్యక్షుడిగా మోతేరాం రాజేశ్వర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. 1964 ఫిబ్రవరి వరకు ఆయన పదవీకాలం కొనసాగింది. టౌన్‌ మున్సిపల్‌ చివరి అధ్యక్షుడిగా సువర్ణ చంటయ్య పనిచేశారు. 1956 సెప్టెంబర్‌ 16 నుంచి 30 నవంబర్‌ వరకు మాజీ ఎమ్మెల్యే గుల్కోట శ్రీరాములు ఇన్‌చార్జి అధ్యక్షుడిగా కొనసాగారు.1964లో మేజర్‌ పంచాయతీగా రూపాంతం చెందిన మంథని.. 2018 జూన్‌ 2 నుంచి మున్సిపల్‌గా మారింది. తొలిసారి 2020 జనవరిలొ జరిగిన ఎన్నికల్లో పుట్ట శైలజ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె 2024 వరకు కొనసాగారు. అవిశ్వాసంతో 2024 ఫిబ్రవరిలో పెండ్రు రమను చైర్‌ పర్సన్‌గా ఎన్నుకున్నారు. 2025 జూన్‌నుంచి ప్రత్యేక పాలన సాగుతోంది.

అప్పుటి జనాభా పదివేలు..

టౌన్‌ మున్సిపల్‌ జనాభా పదివేలు ఉండేది. సమీప సూరయ్యపల్లి ఇందులో కలిసే ఉండేది. సమీప గ్రామాల నుంచి వచ్చిన చాలామంది మంథనిలోనే స్థిరపడ్డారు. గంగాపురి, కూచిరాజ్‌పల్లి, శ్రీరాంనగర్‌, బోయిన్‌పేట, గొల్లగూడెంలో కలిసిఉన్న మేజర్‌ పంచాయతీ యథావిధిగా మున్సిపల్‌గా మారింది. 15 వార్డులు ఉన్న మేజర్‌ పంచాయతీలో 2018లో పెరిగిన జనాభాకు అనుగుణంగా మూడు వార్డులను పెంచుతూ 18 వార్డులుగా చేశారు. ము న్సిపాలిటీగా మారిత తర్వాత విభజనతో 13 వార్డులకు మళ్లీ కుదించారు. ప్రస్తుత జనాభా సుమారు 19,500 ఉండగా, 14,414 మంది ఓటర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement