పెద్దపల్లి ‘యాది’లో తొలిమున్సిపల్ చైర్మన్
● ప్రధాన కూడలికి అమర్‌నగర్‌గా నామకరణం
పెద్దపల్లిరూరల్: నాడు పెద్దపల్లి టౌన్ మున్సిపల్‌కు తొలిచైర్మన్‌గా వ్యవహరించిన అమర్‌చంద్‌జైన్.. నీతి, నిజాయతీకి కట్టుబడి సేవలు అందించారు. దీంతో ఆయన ఇంకా ప్రజల యాదిలో ఉన్నారు. అమర్‌చంద్ మరణానంతరం ఆయన విగ్రహాన్ని కూడలిలో ఏర్పాటు చేసి అమర్‌నగర్‌గా నామకరణం చేశారు. జెండా చౌరస్తా ప్రాంతంలో రిక్రియేషన్ క్లబ్ నిర్మించిన కల్యాణ మండపానికి సైతం ఆయన పేరే పెట్టడం ఆయన మంచితనానికి నిదర్శనం. ప్రగతినగర్ ప్రాంతంలో బల్దియా నిర్మించిన ఎల్‌ఐజీ క్వార్టర్ల పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
పెద్దపల్లి ‘యాది’లో తొలిమున్సిపల్ చైర్మన్


