ఉత్పత్తి వ్యయం తగ్గాలి
గోదావరిఖని: సింగరేణిలో బొగ్గు ఉ త్పత్తి పెంచాలని, వ్యయం తగ్గించాల ని ఆర్జీ –వన్ జీఎం లలిత్‌కుమార్ సూ చించారు. స్థానిక జవహర్‌లాల్ నె హ్రూ స్టేడియంలో ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. ఆర్జీ –వన్ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 49.40 లక్షల టన్నులకు 41.84లక్షల టన్నులు సాధించి 85 శాతం నమోదు చేశామన్నారు. పెరుగుతున్న బొగ్గు అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలన్నారు. ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్‌సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, సీఎంవోఏఐ అధ్యక్షుడు బి.మల్లేశ్, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్, ఏరియా ఇంజినీర్ రాంమోహన్‌రావు, పర్స నల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


