చట్టంపై గౌరవం ఉండాలి
గోదావరిఖని: పోలీసులు చట్టాన్ని గౌరవిస్తూ విఽ దులు నిర్వర్తించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. పోలీస్ కమిషనరేట్‌లో జాతీయ జెండా ఎగురవేసి మా ట్లాడారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ పోలీస్‌ల ప్రధాన బాధ్యత అని గుర్తుచేశారు. మహనీయుల త్యాగాలతోనే స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభించందని, వారిని స్మరించుకోవాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఏసీపీలు రమేశ్, నా గేంద్రగౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


