ఒక భవనం.. మూడు జెండాలు
జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం ఎదుట అధికారులు మూడు మువ్వన్నెల జెండాలు ఆవిష్కరించారు. ఇదే భవనంలో సహకార శాఖ కార్యాలయంతోపాటు, వ్యవసాయ శాఖ, గ్రంథాల య శాఖ ఆఫీసులు ఉన్నాయి. లైబ్రేరియన్ మౌళి, వ్యవసాయాధికారి ప్రత్యూష, సహకార శాఖ ఉద్యోగి కరుణాకర్ ముగ్గురు ఒకేసారి.. ఒకే సమయానికి జెండా ఆవిష్కరించారు.
సేవలకు ప్రశంస
ధర్మారం/గోదావరిఖనిటౌన్: విద్యుత్ పంపిణీ సంస్థలో మొదటి ర్యాంక్ సాధించిన ధర్మారం ఏడీఈ విజయ్‌గోపాల్‌సింగ్, ఖిలావనపర్తి ఏఏ ఈ మహిపాల్‌రెడ్డి ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి నుంచి సోమవారం ప్రశంసాపత్రం అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎన్పీడీసీఎల్‌లో నిర్వహించిన కార్య క్రమ నేపథ్యంలో విధి నిర్వహణలో అందంచిన సేవలకు గుర్తింపుగా వీటిని అందించారు. ఖిలావనపర్తి విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని అన్‌మాండ్ మోర సాయికుమార్‌కు జిల్లాస్థాయిలో ఉత్త మ ఉద్యోగి అవార్డును పెద్దపల్లి సర్కిల్ ఎస్‌ఈ గంగాధర్ అందించారు. అదేవిధంగా వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గోదావరిఖని ఏడీఈ వెంకటేశ్వర్లుకు కూడా ప్రశంసాపత్రం అందజేశారు.
జాతరకు వెళ్తున్నారా?
పెద్దపల్లిరూరల్: ఇళ్లకు తాళం వేసి సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లేవారు సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వాలని పోలీసులు పల్లెల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని పలువార్డుల్లోనూ ఆటోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇంటికి తాళం వేసిఉంటే దొంగలు పడే ప్రమాదముందని చెబుతున్నారు. సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో పోలీసులు గస్తీ తిరుగుతారని పట్టణ ఎస్సై లక్ష్మణ్‌రావు, రూరల్‌ఎస్సై మల్లేశం తెలిపారు.
పరేడ్ ఇన్‌చార్జి మనోడే
రామగుండం/ఓదెల: సికింద్రాబాద్‌లో సోమ వారం నిర్వహించిన గణతంత్ర వేడుకల పరేడ్ కమాండర్‌గా రామగుండం రైల్వే ప్రొటెక్షన్ ఫో ర్స్(ఆర్‌పీఎఫ్) సీఐ కొదురుపాక రాజేంద్రప్ర సాద్ వ్యవహరించారు. సిబ్బంది కవాతుకు ఆ యన అధ్యక్షత వహించారు. ఓదెల మండలం కొలనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజేంద్రప్రసాద్ హైస్కూల్ విద్య పూర్తిచేశారు. ఆయనను ఆర్‌పీఎఫ్ ఎస్సై క్రాంతికుమార్, ఏఎస్సై లు నాగరాజు, రామకృష్ణ అభినందించారు.
ఢిల్లీ వేడుకల్లో అభిరామ్
ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి అభిరామ్ ఢిల్లీలో సోమవా రం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఎన్‌సీసీ కేడెట్‌గా హాజరయ్యాడు. తొమ్మిదో బెటాలియన్ తెలంగాణ, కరీంనగర్ ఎన్‌సీసీకి చెందిన అభిరామ్.. కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఏకే జయంత్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే క్యాంపు(ఆర్‌డీసీ) విధుల్లో పాల్గొన్నాడు.
కాంగ్రెస్ గెలుపే లక్ష్యం
జ్యోతినగర్(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ ఓబీసీ సెల్ జి ల్లా అధ్యక్షుడు, ఎన్టీపీసీ పట్టణ ఎన్నికల ఇన్‌చార్జి పెండ్యాల మహేశ్ అన్నారు. ఎన్టీపీసీలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఆసిఫ్‌పాషా ఆధ్వర్యంలో సోమవారం జరిగి న సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌కు కా ర్యకర్తలే అండ అని అన్నారు. ముచ్చకుర్తి రమే శ్, ఉరిమెట్ల రాజలింగం, కిరణ్‌గౌడ్ ఉన్నారు.
ఒక భవనం.. మూడు జెండాలు
ఒక భవనం.. మూడు జెండాలు
ఒక భవనం.. మూడు జెండాలు
ఒక భవనం.. మూడు జెండాలు


