కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తాం
గోదావరిఖని: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయ నేత చాడ వెంటకరెడ్డి అన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. స్థానిక భాస్కర్‌రావుభవన్‌లో సోమరవారం ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ సహకారంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక విధానాలను ఎండగట్టాలని ఆయన కోరారు. ఉపాధిహామీ పథకాన్ని పేరుమార్చి పేదలకు తీవ్రఅన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. సమావేశంలో నాయకులు కలవేణి శంకర్, గౌతం గోవర్ధన్, తాండ్ర సదానందం, కనకరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఇందిరా పార్క్ ఎదుట ధర్నా
పెద్దపల్లి: రిటైర్డ్ ఎంప్లాయీస్‌పై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మంగళవారం ధర్నా చేస్తామని త పస్ జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండవేని జగన్ తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఆర్నెల్లలో పీ ఆర్సీ అమలు చేస్తామనే ఎన్నికల హామీ అమలు చే యాలన్నారు. ఈ నేపథ్యంలో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు.


