ఇంధన రంగంలో విశేష కృషి
జ్యోతినగర్(రామగుండం): దేశ ఇంధన రంగానికి ఎన్టీపీసీ గణనీయమైన కృషి చేస్తోందని రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత అన్నారు. మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ఆయన జాతీయ పతాకం ఆవిష్కరించారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. ఉద్యోగుల అంకితభావం, నిబద్ధత ఎన్టీపీసీకి గర్వకారణమన్నా రు. ఉద్యోగుల అత్యుత్తమ కృషికి గుర్తింపుగా మెరిటోరియస్ అవార్డులను ప్రదానం చేశారు. సీఐఎస్‌ఎఫ్, విద్యార్థుల పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత తదితరులు పాల్గొన్నారు.


