మార్కెట్ పోటీ తట్టుకోవాలి
గోదావరిఖని: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోటీమార్కెట్‌లో సింగరేణి తట్టుకునేందుకు ఉత్పత్తి లక్ష్యం సాధించాలని, ఇందులో అందరూ పాలుపంచుకోవాలని సింగరేని ఆర్జీ–2 జీఎం వెంకటయ్య కోరారు. యైటింక్లయిన్‌కాలనీ అబ్దుల్ కలాంస్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన మాట్లాడారు. సామాజిక బాధ్యత, సంక్షేమానికి సింగరేణి పెద్దపీట వేస్తోందన్నారు. ఒకే కుటుంబం, ఒకేలక్ష్యం, ఒకేగమ్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. ప్రతినిధులు జిగురు రవీందర్, వనజ, రాముడు, అరవిందరావు, సంతోష్‌కుమార్, సుజన్‌మెహ్రా తదితరులు పాల్గొన్నారు.


