ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?
వేములవాడరూరల్: ప్రమాదం జరిగితేనే విద్యుత్ అధికారులు స్పందిస్తారేమోనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల మీదుగా విద్యుత్ లూజ్ వైర్లు వేలాడుతున్నా సెస్ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి గ్రామ ప్రధాన రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా మారాయి. రైతులు పొలాలు దున్నే సమయంలో భయపడుతూనే సాగు పనులు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు పట్టించుకొని లూజ్‌వైర్లు, వంగిపోయిన స్తంభాలను సరిచేయాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.


