రాష్ట్రంలో అరాచకపాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచకపాలన

Jan 26 2026 4:04 AM | Updated on Jan 26 2026 4:04 AM

రాష్ట్రంలో అరాచకపాలన

రాష్ట్రంలో అరాచకపాలన

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

గోదావరిఖని: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం స్థానిక టీబీజీకేఎస్‌ కార్యాలయంలో మా జీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ కుంభకోణాలకు పాల్పడుతోందని, ఈక్రమంలోనే నైనీ బొగ్గు బ్లాక్‌ టెండర్లను రద్దు చేశారని ధ్వజమెత్తారు. సింగరేణిలో సైట్‌ విజిట్‌ పేరిట కాంగ్రెస్‌ నా యకులకు అనుకూలంగా ఉన్నవారికి టెండర్లను క ట్టబెట్టి కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనస్‌కు టెండర్లు అప్పగిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం అదనంగా కోట్‌చేస్తూ సంస్థకు నష్టం తీసుకొస్తుందని ఆరోపించారు. సింగరేణిలో కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు కౌశిక్‌ హరి, గోపు ఐలయ్యయాదవ్‌, పీటీ స్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement