కొలనూర్‌ జాతరకు 52 ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

కొలనూర్‌ జాతరకు 52 ఏళ్లు

Jan 26 2026 4:04 AM | Updated on Jan 26 2026 4:04 AM

కొలనూ

కొలనూర్‌ జాతరకు 52 ఏళ్లు

సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026
వన జాతరకు సన్నద్ధం

జిల్లాలోని సామ్మక్క – సారలమ్మ జాతరకు ఆయా కమిటీలు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. గోదావరిఖని, గోలివాడ, కొలనూర్‌, కొదురుపాక, నీరుకుల్లతోపాటు వివిధ ప్రాంతాల్లో జాతర నిర్వహిస్తారు. ఇందుకోసం అమ్మవార్ల గద్దెలు ముస్తాబు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. క్యూలైన్లు నిర్మించారు. భక్తులకు తాగునీరు, వసతి కల్పిస్తున్నారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు. జాతరకు వెళ్లే భక్తులు ముందుగానే తమ ఇళ్లలో సమ్మక్క – సారలమ్మకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తున్నారు.

– గోదావరిఖని/సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

ఓదెల(పెద్దపల్లి): చుట్టూ గుట్టలు, పచ్చని పొలాల మధ్య కొలువుదీరారు కొలనూర్‌ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు. ఈఏడాదితో 52ఏళ్లు పూర్తవుతోంది. ఈనెల 28నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహణ జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ , నిజామాబాద్‌ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివస్తారు. ఆర్టీసీ బస్సులతోపాటు రైలు సౌకర్యం కూడా ఉంది.

వసతులు కల్పించాం – కొలిపాక మధునయ్య, చైర్మన్‌, జాతర కమిటీ

కొలనూర్‌ అల్లీమాసాని చెరువు సమీప గుట్టల్లో సమ్మక్క – సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తిచేశాం. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా సుమారు రెండు లక్షల మందికిపైగా భక్తులు తరలివస్తారు. తాగునీరు, విద్యుత్‌, నీడ, రహదారి సౌకర్యాలు కల్పించాం.

కొలనూర్‌ జాతరకు 52 ఏళ్లు 1
1/3

కొలనూర్‌ జాతరకు 52 ఏళ్లు

కొలనూర్‌ జాతరకు 52 ఏళ్లు 2
2/3

కొలనూర్‌ జాతరకు 52 ఏళ్లు

కొలనూర్‌ జాతరకు 52 ఏళ్లు 3
3/3

కొలనూర్‌ జాతరకు 52 ఏళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement