నేనే మేయర్‌! | - | Sakshi
Sakshi News home page

నేనే మేయర్‌!

Jan 26 2026 4:04 AM | Updated on Jan 26 2026 4:04 AM

నేనే

నేనే మేయర్‌!

సాక్షి, పెద్దపల్లి:

న్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ముందే జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌ సహా మూడు మున్సిపాలిటీల్లో రాజకీయం వేడెక్కింది. మేయర్‌, చైర్‌పర్సన్‌ పదవులు అధిష్టించడమే లక్ష్యంగా నాయకులు పావులు కదుపుతున్నారు. రామగుండం మేయర్‌ కుర్చీపై కన్నేసిన పలువురు నేతలు.. తమకు రిజర్వేషన్‌ అనుకూలించిన డివిజన్లలో ‘నేనే మేయర్‌’ అభ్యర్థిని అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నా రు. అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున మేయర్‌ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోయినా.. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఎవరికివారే మేయర్‌ అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. తమ వర్గం నేతలకు టికెట్లు ఇప్పించి, వారిని గెలిపించుకునేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా మూడు మున్సిపాలిటీలు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథనిలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది.

మేయర్‌ సీటిస్తే.. ఫైనాన్స్‌ హెల్ప్‌

తమకు మేయర్‌ స్థానం కేటాయిస్తే, అవసరమైతే పలువురు వార్డు/డివిజన్‌ అభ్యర్థులకు ఫైనాన్స్‌ సపోర్ట్‌ చేసి, వారిని గెలిపించుకుంటామని ఎమ్మెల్యే చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తూ ఎమ్మెల్యేకు విన్నవించుకుంటున్నారు. చైర్‌పర్సన్‌, మేయర్‌ పదవులపై కన్నేసిన పలువురు సీనియర్‌ నేతలు.. తామే చైర్‌పర్సన్‌, మేయర్‌ అభ్యర్థులమని వార్డులు/డివి జన్లలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే పలు వార్డుల్లో అభ్యర్థులు ఖరారు కాకముందే ప్రచారం విస్తృతంగా కొనసాగిస్తున్నారు. తమవర్గం నేతలకు టికెట్లు ఇప్పించుకోవాలని, వారిగెలుపు కోసం ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

రామగుండంలో పోటాపోటీ..

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ స్థా నాన్ని ఎస్సీ జనరల్‌ కేటాయించారు. దీంతో పలువురు ఎస్సీ ఆశావహులు మేయర్‌ రేసులో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మహంకాళి స్వామి, మాజీ మేయర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌తోపాటు, పలువురు నాయకులు తమకు అనుకూలమైన డివిజన్లలో పోటీచేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

మున్సిపాలిటీల్లో కొలిక్కి..

పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కుర్చీ బీసీ జనరల్‌ కు కేటాయించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నూగిళ్ల మల్లయ్యకు దాదాపుగా సీటు ఖరారు అయ్యింది. మంథని బీసీ జనరల్‌కు కేటాయించగా, అక్కడ సైతం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఓడ్నాల శ్రీనివాస్‌ అభ్యర్థిత్వానికి మంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమా చారం. సుల్తానాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడు బిరుదు కృష్ణకు చైర్మన్‌ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరికొందరు నేతలు సైతం చైర్‌పర్సన్‌ సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

నేనే చైర్‌పర్సన్‌.. నేనే కార్పొరేటర్‌

బల్దియాల్లో ఆశావహుల విస్తృత ప్రచారం

నోటిఫికేషన్‌ విడుదలకు ముందే రాజకీయ వేడి

కొలిక్కి వచ్చిన

కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా?

రామగుండం మేయర్‌ అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ

నేనే మేయర్‌!1
1/1

నేనే మేయర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement