మేడారానికి బస్సులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మేడారానికి బస్సులు ప్రారంభం

Jan 26 2026 4:04 AM | Updated on Jan 26 2026 4:04 AM

మేడార

మేడారానికి బస్సులు ప్రారంభం

పెద్దపల్లిరూరల్‌/పెద్దపల్లి: మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం స్థానిక బస్‌స్టేషన్‌ నుంచి ఆర్టీసీ బస్సు సేవలను ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈనెల 28 నుంచి మొదల య్యే జాతరకు భక్తులు తరలివెళ్లి మొక్కులు సమర్పించుకునేందుకు వీలుగా ఆర్టీసీ సేవల ను అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. పెద్దపల్లి నుంచి 175 బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

రామగుండం: ఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఆదివా రం స్థానిక రై ల్వేస్టేషన్‌లో తనిఖీలు చేశా రు. ప్లాట్‌ఫామ్స్‌తోపాటు రైళ్లలోనూ తని ఖీలు చేశారు. అనుమానితులను ప్రశ్నించి వది లేశారు. ఆర్‌పీఎఫ్‌ ఎస్సై క్రాంతికుమార్‌, ఏఎస్సైలు నాగరాజు, రామకృష్ణ, కానిస్టేబుల్‌ కవిత, పలువురు పోలీసులు పాల్గొన్నారు.

కొత్త గనులు కేటాయించాలి

గోదావరిఖని: సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు గనులు కేటాయించాలని, రాష్ట్రప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.47 వేల కోట్లు వెంటనే ఇ ప్పించాలని ఏఐటీయూసీ నాయకులు కోరా రు. కొత్తగూడెం పర్యటనకు వచ్చిన కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ ఆదివారం ఒక వినతిపత్రం అందజేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యులర్‌ సీఎండీ లేక నిర్వహణ గాడిప్పుతోందని అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు మిర్యాల రంగయ్య, సారయ్య, వైవీ రావు, మడ్డి ఎల్లా గౌడ్‌, వీరభద్రం, వంగ వెంకట్‌, రాంగోపాల్‌, రంగు శ్రీను, రమణమూర్తి పాల్గొన్నారు.

ఓటు బలమైన ఆయుధం

పెద్దపల్లి: ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య అన్నా రు. కలెక్టరేట్‌లో ఆదివారం ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ, ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. మనదేశ భవిష్యత్‌ ఓటరు చేతిలోనే ఉంటుందని, ఎన్నికల సమయంలో ఓటుహక్కు సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా ఓటుహక్కు పొందిన యువతను అభినందించారు. సీనియర్‌ ఓటర్లను సన్మానించారు. కలెక్టరేట్‌ ఏవో ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మేడారానికి బస్సులు ప్రారంభం 1
1/3

మేడారానికి బస్సులు ప్రారంభం

మేడారానికి బస్సులు ప్రారంభం 2
2/3

మేడారానికి బస్సులు ప్రారంభం

మేడారానికి బస్సులు ప్రారంభం 3
3/3

మేడారానికి బస్సులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement