పాలనపై అవగాహన
పెద్దపల్లిరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రథమ పౌరులుగా ఎన్నికైన సర్పంచులకు తమ బాధ్యతలు, హక్కులపై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. దీంతోపాటు పల్లె పాలనలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్వహించే విధులపైనా తర్ఫీదు ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ఐదురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈక్రమంలో జిల్లాలోని 263 పంచాయతీల సర్పంచులకు రెండు విడతల్లో శిక్షణ ఇచ్చేలా జిల్లా అధికారులు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఐదురోజులపాటు మాస్టర్ ట్రెయినర్లు సర్పంచులకు శిక్షణ పూర్తిచేశారు. మలివిడతలో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మరికొందరు సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలివిడత శిక్షణ పొందిన పలువురు సర్పంచులు తమకు సులువుగా అర్థమయ్యేలా ట్రెయినర్లు ఎల్‌ఈడీ స్క్రీన్లు చూపిస్తూ వివిధ అంశాలు వివరించారని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు పేర్కొన్నారు. వారిమాటల్లోనే..
పలు గ్రామ పంచాయతీ సర్పంచుల మనోగతం
నిబంధనల గురించి తెలుసుకున్నాం
ముగిసిన తొలివిడత ఐదురోజుల శిక్షణ తరగతులు


