నిబంధనలు తెలుసుకున్నా | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు తెలుసుకున్నా

Jan 26 2026 4:04 AM | Updated on Jan 26 2026 4:04 AM

నిబంధ

నిబంధనలు తెలుసుకున్నా

గ్రామసర్పంచ్‌గా ప్రజలకు సేవలు అందించేందుకు మాకున్న అధికారాలు, బాధ్యతలు ఏమిటో, చట్టం ఏంచెబుతుందనే విషయాలపై ట్రెయినర్లు వివరించారు. లేఅవుట్‌ నిబంధనలు పాటిస్తేనే ఇంటి అనుమతులు ఇవ్వాలని తెలుసుకున్న. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పాటించాల్సిన పద్ధతులపై అవగాహన వచ్చింది.

– పెర్క రిబిక, కొత్తపల్లి

చాలా తెలుసుకున్నాం

ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో పంచాయతీ ఎన్నికల్లో పోటీపడి గెలిచాం. సర్పంచ్‌ అయిన తర్వాత ఏంచేయాలో, ప్రజలకు ఎలా సేవలు అందించాలో అనే విషయాలపై పంచాయతీరాజ్‌ చట్టం నిబంధనలను గురించి ట్రెయినర్లు వివరించారు. ప్రజలకు ఉపాధి పనులను కల్పించేందుకు అనుసరించాల్సిన పద్ధతుల గురించి ఇందులో తెలుసుకున్నా.

– పెద్దపల్లి తిరుమల, పాలకుర్తి

అవగాహన వచ్చింది

నేను తొలిసారి మా ఊరుకు సర్పంచ్‌గా ఎన్నికయ్యా. పల్లెపాలనలో మా బాధ్య తలు ఏమిటో వివరించేందుకు చేపట్టిన శిక్షణ తరగతులు మాకు ఎంతో ఉపకరించాయి. మా బాధ్యతలు, విధులపై అవగాహన కలిగింది. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై వివిధ అంశాలు చూపుతూ సులువుగా అర్థమయ్యేలా వివరించారు.

– తాడిచెట్టి చామంతి, రాఘవాపూర్‌

సర్పంచులకు ఉపయోగం

తొలిసారి ఎన్నికై న సర్పంచులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారందరికీ పంచాయతీ చట్టాలు, నిబంధనల అమలు తదితర అంశాలపై ఐదురోజులు శిక్షణ ఇచ్చాం. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నిఅంశాలపై పూర్తిగా అవగాహన కల్పించాం. పల్లె పాలనకు రూపొందించిన చట్టాలను అతిక్రమించొద్దని సూచించాం.

– వీరబుచ్చయ్య, డీపీవో

నిబంధనలు తెలుసుకున్నా 
1
1/3

నిబంధనలు తెలుసుకున్నా

నిబంధనలు తెలుసుకున్నా 
2
2/3

నిబంధనలు తెలుసుకున్నా

నిబంధనలు తెలుసుకున్నా 
3
3/3

నిబంధనలు తెలుసుకున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement