‘శాతవాహన’లో క్రికెట్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

‘శాతవాహన’లో క్రికెట్‌ టోర్నీ

Jan 25 2026 6:52 AM | Updated on Jan 25 2026 6:52 AM

‘శాతవ

‘శాతవాహన’లో క్రికెట్‌ టోర్నీ

గోదావరిఖనిటౌన్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక శాతవాహన యూ నివర్సిటీ పీజీ కళాశాలలో శనివారం న్యాయవాదులు, జ్యుడీషియల్‌ ఎంప్లాయీస్‌ స్టాఫ్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు మ్యాచ్‌ ప్రారంభించారు. కోర్ట్‌స్టాఫ్‌ జట్టు విజయం సాధించింది. సీనియ ర్‌ సివిల్‌ జడ్జి జీవన్‌సూరజ్‌సింగ్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వెంకట్‌సచిన్‌రెడ్డి, గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్‌కుమార్‌, కోశాధికారి ఎండీ ఉ మర్‌, ప్రతినిధులు ఎరుకల ప్రదీప్‌కుమార్‌, శో భారాణి, శాంతన్‌కుమార్‌, కొత్తకాపు సుధాకర్‌రెడ్డి, పెట్టం శ్రీనివాస్‌, చందాల శైలజ, పంగ శంకర్‌, రాజేందర్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

భక్తుల భద్రత ముఖ్యం

గోదావరిఖని: సమ్మక్క – సారలమ్మ భక్తుల భద్రత ముఖ్యమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. గోదావరి తీరంలోని సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంగణాన్ని శనివారం సీపీ పరిశీలించారు. తొలుత అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. భ క్తుల భద్రత, రక్షణ చర్యలు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, ఏర్పాట్లు తదితర అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఏసీపీ రమేశ్‌, సీఐలు ప్రసాద్‌రావు, ఇంద్రాసేనారెడ్డి, రాజేశ్వర్‌రావు, భీమే శ్‌, జాతర కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డిఉన్నారు. కాగా, అమ్మవార్ల జాతర ప్రాంగణం రాత్రివేళ విద్యుత్‌ వెలుగుల్లో ఆకట్టుకుంది.

బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

పెద్దపల్లి: మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తాచాటాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన బీ ఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయ న మాట్లాడారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ ము న్సిపల్‌ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికలు సి ద్ధం చేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దాస రి మనోహర్‌రెడ్డి అధ్యక్షత జరిగిన సమావేశంలో నాయకులు రఘువీర్‌సింగ్‌, ఉప్పు రాజ్‌కుమార్‌, మోబిన్‌, గుణపతి, సందీప్‌రావు, సూర శ్యాం, పెంచాల శ్రీధర్‌, పూదరి చంద్రశేఖర్‌, పెద్ది వెంకటేశ్‌, రాజమల్లు, గోపి పాల్గొన్నారు.

గణతంత్ర వేడుకలకు ఉజ్వల

కోల్‌సిటీ (రామగుండం): దే శరాజధాని న్యూఢిల్లీలోని ఎ ర్రకోట వేదికపై గోదావరిఖ ని పేరు మరోసారి గర్వంగా మెరవనుంది. గోదావరిఖని నగరానికి చెందిన ప్రముఖ కూచిపూడి కళాకారిణి, ‘నాట్యఖని’ వ్యవస్థాపకురాలు గుమ్మడి ఉజ్వలకు గణతంత్ర దినోత్సవంలో నాట్యప్రదర్శన ఇచ్చే అరుదైన అవకాశం దక్కింది. ఏటా దేశవ్యాప్తంగా ఎంపికై న కళాకారులతో వివిధ రాష్ట్రాల సంస్కతి – సంప్రదాయాలను కళ్లకు కట్టేలా ప్రదర్శించే గణతంత్ర వేడుకల్లో ఈసారి ఉజ్వల కూచిపూడి నృత్యంతో ఆకట్టుకోనున్నారు. ఈనెల 26న ఎర్రకోట వద్ద నిర్వహించే వేడుకల్లో నాట్యప్రదర్శన ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 30 మంది కళాకా రులను ఎంపిక చేయగా, అందులో గోదావరిఖనికి చెందిన ఉజ్వల ఎంపిక కావడం విశేషం. ఆమెను పలువురు అభినందించారు.

జాగ్రత్తలు తీసుకోవాలి

పెద్దపల్లి: మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్‌ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని మాస్టర్‌ ట్రైనర్స్‌ సదయ్య, చంద్రశేఖర్‌, ప్రసాద్‌, వెంకటేశ్వర్లు, కె.వెంకటేశ్వర్లు సూచించారు. రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు కలెక్టరేట్‌లో శనివారం అవగాహన కల్పించారు. గో దావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని ఆర్వోలు, ఏఆర్వోలు హాజరయ్యారు. నామి నేషన్ల పరిశీలన, జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతుల గురించి వారు వివరించారు.

లక్ష్యం మేరకు ఉపాధి పనులు

జూలపల్లి/ఎలిగేడు(పెద్దపల్లి): నిర్దేశిత లక్ష్యం మేరకు ఉపాధిహామీ పనులు పూర్తిచేయాలని అదనపు డీఆర్డీవో ప్రవీణ్‌ కుమార్‌ సూచించా రు. ఎంపీడీవోలు పద్మజ, భాస్కర్‌రావు, ఏపీ వో సదానందం, ఎంపీవో కిరణ్‌తో కలిసి ఎఫ్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులకు ఉపాధిపను లపై శనివారం అవగాహన కల్పించారు. కూలీల హాజరు శాతం పెంచాలని తెలిపారు. పశువుల పాకలను మార్చి 31లోపు పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.

‘శాతవాహన’లో క్రికెట్‌ టోర్నీ1
1/3

‘శాతవాహన’లో క్రికెట్‌ టోర్నీ

‘శాతవాహన’లో క్రికెట్‌ టోర్నీ2
2/3

‘శాతవాహన’లో క్రికెట్‌ టోర్నీ

‘శాతవాహన’లో క్రికెట్‌ టోర్నీ3
3/3

‘శాతవాహన’లో క్రికెట్‌ టోర్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement