సజావుగా రహదారుల విస్తరణ
పెద్దపల్లి: రోడ్ల విస్తరణ సజావుగా చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సుల్తానాబాద్ పరి ధిలోని పూసాల ఎంపీపీఎస్, పల్లెదవాఖాన, బీసీ బాలుర గురుకులం, సుల్తానాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన వివిధ పనులను కలెక్టర్ శనివారం పరిశీలించి మాట్లాడారు. తహసీల్దార్ బషీరొద్దీన్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఎంపీవో సమ్మిరెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ రవికిరణ్, ఏఈ గుణశేఖర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎంఈవో రాజయ్య ఉన్నారు.
అవకాశాలను వినియోగించుకోవాలి
సుల్తానాబాద్‌రూరల్: అవకాశాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. భూపతిపూర్ కేజీబీవీ, గర్రెపల్లి ఎస్సీ రెసిడెన్సియల్ కళాశాల, బీసీ బాలుర గురుకులాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఏఈ గుణశేఖర్, ప్రిన్సిపాల్స్ ఉన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


