ఓటే.. మన వజ్రాయుధం | - | Sakshi
Sakshi News home page

ఓటే.. మన వజ్రాయుధం

Jan 25 2026 6:52 AM | Updated on Jan 25 2026 6:52 AM

ఓటే..

ఓటే.. మన వజ్రాయుధం

నేడు జాతీయ ఓటరు దినోత్సవం ఓటు వేయకపోతే బతికిలేనట్టే.. ఉమ్మడి జిల్లా ఓటర్ల వివరాలు

కరీంనగర్‌ అర్బన్‌/సిరిసిల్ల కల్చరల్‌: ఓటు.. బ్రహ్మాస్త్రం.. ప్రభుత్వాలను కూల్చాలన్నా.. నియంతృత్వ విధానాలకు చరమగీతం పాడాలన్నా మీట నొక్కి వ్యవస్థను మార్చొచ్చు. ఏక్‌ దిన్‌కా సుల్తాన్‌ అన్నట్లు ఎన్నికల్లో ‘ఓటు’కున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇంతటి మహత్తర శక్తిని పొందడంలో యువత ఆసక్తి చూపకపోవడం విచారకరం. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు ఉన్న శక్తి ఏపాటిదో స్పష్టౖమైన విషయం విదితమే. ఒక్క ఓటుతో గెలిచినవారుండగా సమాన ఓట్లతో టై కాగా టాస్‌తో విజేతను నిర్ణయించారు. అందుకే ప్రతి ఓటు విలువైనదే.. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కథనం..

– వివరాలు 8లో..

మల్యాల: ఈమె మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన బండారి దుబ్బరాజవ్వ(102). శతాధిక వృద్ధురాలైనా.. కళ్లు కనపడకపోయినా, నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ.. కుటుంబ సభ్యుల సహకారంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ‘ఎన్నిసార్లు ఓటు వేసిన్నో నాకు గుర్తు లేదు. బుద్ధి తెలిసినప్పటి నుంచి ఓటు ఏసేందుకు పని ఇడిసిపెట్టుకొని, పోయిన. మొన్నటి సర్పంచ్‌ ఓట్లలోనూ నాకు నడువరాకపోయినా ఓటు వేసిన. ఓటు వేయకపోతే జనాభా లెక్కలళ్ల మనం లేనట్టేని మావోళ్లు చెప్పిండ్రు’. అని దుబ్బరాజవ్వ ఓటు ప్రాముఖ్యతను చెప్పి.. నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

జిల్లా మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు

కరీంనగర్‌ 10,64,129 5,23,898 5,40,175 56

రాజన్న సిరిసిల్ల 4,76,187 2,30,294 2,45,849 44

పెద్దపల్లి 7,24,608 3,56,740 3,67,815 53

జగిత్యాల 7,30,959 3,50,778 3,80,143 38

ఓటే.. మన వజ్రాయుధం1
1/1

ఓటే.. మన వజ్రాయుధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement