రేపటి నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు
పెద్దపల్లి: మేడారం సమ్మక్క – సారలమ్మ జా తరకు ఈనెల 26వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సు లు నడిపిస్తామని కరీంనగర్ రీజినల్ మేనేజర్(ఆర్‌ఎం) రాజు తెలిపారు. ఇందుకోసం ముగ్గురు డీఎంలు, 30 మంది సూపర్‌వైజర్లు, మరో 500మంది డ్రైవర్లు, కండక్టర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. వీరందరినీ సమన్వయం చేస్తూ బస్సులు సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 175 బస్సులను పెద్దపల్లి నుంచి మేడారానికి నడిపిస్తామని వివరించారు.
భక్తులకు సౌకర్యాలు
బస్సుల కోసం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బస్ డి పోకు కేటాయించిన స్థలాన్ని చదును చేయించారు. అక్కడే క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చలువ పందిళ్లు, తాగునీటి వసతి కల్పించారు. విద్యుత్ దీపాలు అమర్చారు. తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎమ్మెల్యే విజయరమణారావు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు.
పెద్దలకు రూ.420, పిల్లలకు రూ.220 చార్జి
ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మేడారం జాతరకు బస్‌చార్జి పెద్దలకు రూ.420, పిల్లలకు రూ.220 చొప్పున నిర్ణయించామని ఆర్‌ఎం రాజు వివరించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తింపజేస్తున్నామని స్పష్టం చేశారు. పెద్దపల్లి నుంచి మంథని, కాటారం, భూపాలపల్లి, ములుగు మెయిన్ రోడ్డు, పస్రా మీదుగా బస్సులు ఎస్‌ఎస్ తాడ్వాయి చేరుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
‘ఖని’లో నేటినుంచి ప్రత్యేక బస్సులు..
గోదావరిఖనిటౌన్: మేడారం సమ్మక – సారలమ్మ జాతరకు ఆదివారం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని డీఎం నాగభూషణం శనివారం తెలిపారు. గోదావరిఖని నుంచి రోజూ 24 గంటలపాటు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. జాతర కోసం 115 బస్సులు, 230 డ్రైవర్లు, 170 మంది ఇతర ఉద్యోగులను అందుబాటులో ఉంచామన్నారు. పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.230గా చార్జీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే గోలివాడ జాతరకు ఈనెల 27 నుంచి స్పెషల్ బస్సులు నడుపుతామన్నారు. వివరాలకు 94413 35701 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
అందుబాటులో ముగ్గురు డీఎంలు.. 500 మంది కండక్టర్లు, డ్రైవర్లు
పెద్దపల్లిలో ఏర్పాట్లు పూర్తి


