సింగరేణిని దోచుకున్నదెవరో తేల్చుకుందామా?
గోదావరిఖని: సింగరేణిని దోచుకున్నదెవరో తేల్చుకునేందుకు బీఆర్‌ఎస్ సిద్ధం కావాలని, 2014 నుంచి విచారణ కమిషన్ వేసి నిజానిజాలు తేల్చుకుందామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూ ర్ సవాల్ చేశారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూగర్భ గనులను పాతర పెట్టి రామగుండం ఊరు మధ్య ఉపరితల గనులు తెరిచి బొందల గడ్డగా మార్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నా రని ఆరోపించారు. ఇప్పటికై నా పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబు తారని హెచ్చరించారు. నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ కోరారు. పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల కలలు సాకారం చేసేలా కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్


