‘ఎల్లంపల్లి’ నీటి తరలింపు
ధర్మారం(ధర్మపురి): నందిమేడారం రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన ఎల్లంపల్లి విద్యుత్ మోటారును ఇంజినీరింగ్ అధికారులు శనివారం సాయంత్రం ప్రారంభించారు. రిజర్వాయర్ వద్ద పేజ్– 1వ విద్యుత్ మోటార్‌ను ఆన్ చేయగా.. పైప్‌లైన్ ద్వారా 247 క్యూసెక్కులు గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్‌లోకి తరలివెళ్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న వేంనూరు పంప్‌హౌస్ నుంచి రెండు రోజులపాటు నందిమేడారం రిజర్వాయర్‌లోకి నీటిని తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఓటుహక్కుపై అవగాహన
పెద్దపల్లిరూరల్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు ఎంతో విలువైనదని, ఎన్నికల్లో బ్రహ్మస్త్రంగా ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆర్డీవో గంగయ్య అన్నారు. ఆర్డీవో ఆఫీసులో ఉద్యోగులు, సిబ్బంది తదితరులతో శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఓటరుగా నమోదై ఉన్నవారు.. తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకుంటామని అన్నారు.
‘ఎల్లంపల్లి’ నీటి తరలింపు


