మర్యాదగా వ్యవహరించాలి
పాలకుర్తి(రామగుండం): పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫి ర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి సూచించారు. బసంత్‌నగర్ ఠాణాను డీసీపీ ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలిచ్చారు. తొలుత అన్ని విభాగాల పనితీరు గురించి పోలీస్ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నా రు. రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అంతకుముందు స్థానిక పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్, బసంత్‌నగర్ ఎస్సై శ్రీధర్, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.


