మినీ మేడారం.. జాతరకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

మినీ మేడారం.. జాతరకు సిద్ధం

Jan 24 2026 8:52 AM | Updated on Jan 24 2026 8:52 AM

మినీ

మినీ మేడారం.. జాతరకు సిద్ధం

● 28 నుంచి 31 వరకు వనదేవతల మహాజాతర ● గోదావరిఖనిలో గద్దెలకు ఆధునిక హంగులు ● ఇప్పుడే మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు ● కొలనూర్‌, నీరుకుల్ల, కొదురుపాకలోనూ పకడ్బందీ ఏర్పాట్లు

గోదావరిఖని/పెద్దపల్లి: రామగుండం నగర శివారులోని గోదావరి నతీరంలో గల సమ్మక్క – సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు. మేడారం తర్వాత అత్యంత వైభవంగా జరిగే గోదావరిఖని జాతరకు లక్షల మంది భక్తులు తరలివస్తారు. పెద్దపల్లి, కరీంనగర్‌తోపాటు మంచి ర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల నుంచి కూడా గిరిజను లు, గిరిజనేతరులు, ఆదివాసీలు, ఆదివాసేతరులు కూడా లక్షల్లో తరలివచ్చి సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను దర్శంచుకోవడం ఆనవాయితీ.

ఆధునికీకరణకు రూ.4కోట్లు..

గోదావరిఖనిలోని సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంతం ఆధునికీకరణకు సింగరేణి సుమారు రూ.4కోట్లు వెచ్చించింది. గతంలో మాదిరిగా కాకుండా జాతర సమయంతో పాటు ఏడాదిపాటు భక్తులు సేదతీరేందుకు భారీషెడ్డు నిర్మించింది. ము న్సిపల్‌ ద్వారా ప్రహరీ నిర్మించి ఐరన్‌గ్రిల్స్‌ ఏర్పా టు చేశారు. విశాలమైన సీసీ రోడ్లు నిర్మించారు. కాగా, జాతర ఏర్పాట్లను కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ శుక్రవా రం పరిశీలించారు. పలు సూచనలు చేశారు.

ప్రధాన ద్వారం ముస్తాబు

జాతర ప్రాంగణం ముందు సమ్మక్క–సారలమ్మ వి గ్రహాలు ఏర్పాటు చేశారు. ఎడమవైపు టికెట్‌ కౌంటర్లు, కుడివైపు క్యూలైన్లు నిర్మించారు.

అమ్మవార్ల గద్దెలన్నీ ఒకేలైన్‌లో..

సమ్మక్క– సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు గద్దెలు అన్నీ ఒకేలైన్‌లో నిర్మించారు. భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా గద్దెలకు రెండువైపులా ఐరన్‌గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోరింగ్‌ షాబాది బండ ఏర్పాటు చేశారు. గద్దెల ఎత్తుపెంచి చుట్టూ ఐరన్‌ పైపులు ఏర్పాటు చేశారు.

పుష్కరఘాట్‌ ఆధునికీకరణ

భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా సమీపంలోని గోదావరి నదీతీరంలో పుష్కరఘాట్‌ను ఆధునికీకరించారు. ప్రస్తుతం మెట్ల మార్గాన్ని మరమ్మతు చేస్తున్నారు. అలాగే జల్లు స్నానాల చేసేందుకు వీలుగా సింగరేణి యాజమాన్యం పైపులైన్లు ఏర్పాటు చేస్తోంది.

కొమురవెల్లి.. వేములవాడ.. కొండగట్టు..

సమ్మక్క – సారలమ్మ జతరకు వెళ్లే భక్తులు తొలుత వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి, కొండగట్టు శ్రీఆంజనేయస్వామి, కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈక్రమంలోనే ఆయా ఆలయాలు ప్రస్తుతం భక్తులతో పోటెత్తుతున్నాయి.

పెద్దపల్లి నియోజకవర్గంలో..

ఓదెల మండలం కొలనూరు, సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల, కొదురుపాకలో అధికారికంగా గిరిజనదేవతల జాతర నిర్వహిస్తారు. అదేవిధంగా పెద్దపల్లి మండలం హనుమంతునిపేట, సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి, తొగర్రాయి, ఓదెల మండలం మడక, కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి, మీర్జంపేట, ఎలిగేడు, జూలపల్లి మండలం వెంకట్రావుపల్లిలోనూ వేడుకలు నిర్వహిస్తారు.

సమ్మక్క – సారలమ్మ జాతర ఇలా..

28న సారలమ్మ గద్దెకు రావడం

29న సమ్మక్క గద్దెకు రావడం

30న భక్తులు మొక్కులు సమర్పించుకోవడం

31న అమ్మవార్లు వనప్రవేశం చేయడం

ఏర్పాట్లు పరిశీలన

పెద్దపల్లి నియోజకవర్గంలో సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే విజయరమణారావుతోపాటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. తాగునీరు, విద్యుత్‌, రోడ్డు తదితర సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు.

మినీ మేడారం.. జాతరకు సిద్ధం 1
1/2

మినీ మేడారం.. జాతరకు సిద్ధం

మినీ మేడారం.. జాతరకు సిద్ధం 2
2/2

మినీ మేడారం.. జాతరకు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement