విలువైనది ప్రాణం
జ్యోతినగర్(రామగుండం): ప్రతీప్రాణం విలు వైనదని, ప్రతీఒక్కరు బాధ్యతగా రోడ్డు ప్రయా ణం చేయాలని రామగుండం పోలీస్ కమిషన ర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత, పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేశ్ పర్యవేక్షణలో అరైవ్–అలైవ్ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో శుక్రవారం జరిగింది. సీపీ మాట్లాడుతూ, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత మాట్లాడుతూ.. ఎన్టీపీసీ ఉద్యోగులు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు సేఫ్టీ పాటించేలా చర్యలు తీసుకుంటామన్నా రు. పోలీస్ అధికారులు శ్రీనివాస్, ప్రవీణ్ కు మార్, రాజేశ్వరరావు, అనిల్ కుమార్, ఉదయ్ కిరణ్, సంధ్యారాణి, వెంకట్‌స్వామి ఉన్నారు.
‘పుల్లూరి’ రాక వాయిదా
జూలపల్లి(పెద్దపల్లి): ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పుల్లూరి ప్రసాదరావు ఉరఫ్ చంద్రన్న తన స్వగ్రామం రాక ఒకరోజు వాయిదా పడింది. సుమారు 45 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత జనజీవనంలో కలిసిన ఆయన.. తొలుత శనివారం స్వగ్రామానికి వస్తారని ఆశించారు. కానీ, కొన్నికారణాలతో ఒకరోజు వాయిదా పడినట్లు ఆయన మిత్రులు తెలిపారు. ఆదివారం ఉదయమే తన చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారని, గ్రామంలో సమావేశం నిర్వహించి తన ఆనుభవాలను వెల్లడించనున్నట్లు సమాచారం.
ప్రభుత్వ కాలేజీల్లోనే చదవాలి
పెద్దపల్లి: ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన వి ద్య అందుతోందని, విద్యార్థులు ఇంటర్మీడియ ట్‌ను అందులోనే చదవాలని ఉమ్మడి కరీంన గర్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు స్పెషలాఫీసర్ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన పే రెంట్, లెక్చరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాలలోని ‘వాల్ ఆఫ్ ఫేమ్’లోనీ పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ఎ దగాలని సూచించారు. జిల్లా ఇంటర్ విద్య నో డల్ ఆఫీసర్ కల్పన మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్, వార్డెన్ అంజయ్య, లెక్చరర్లతోపాటు తల్లిదండ్రులు పద్మ, రాంచందర్, శ్రీనివాస్, యశోద, శ్యామల, భాగ్యలక్ష్మి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,953
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 7,953 ధర పలికిందని ఇన్‌చార్జి కార్యదర్శి ప్ర వీణ్‌రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,088గా, సగటు రూ.7,613గా ధర నమోదైందన్నారు. రైతుల నుంచి 416 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
27న యథావిధిగా కొనుగోళ్లు..
స్థానిక మార్కెట్‌లో మంగళవారం (ఈనెల 27 న ) పత్తి కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతా యని ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం రిపబ్లిక్ డే ఉన్నందున పత్తి కొ నుగోలు ఉండదని, ఈనెల 28 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీవరకు సమ్మక్క– సారలమ్మ జాతర ఉన్నందున మార్కెట్‌కు సెలవు ప్రకటించామన్నారు. ఫిబ్రవరి 2 నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
అంకితభావం ముఖ్యం
ధర్మారం(ధర్మపురి): ప్రభుత్వ ఉపాధ్యాయు లు అంకితభావంతో పనిచేసి గ్రామీణ విద్యా ర్థులను విద్య, క్రీడా రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఎంపీడీవో సులోచన, జిల్లా మా నిటరింగ్ అధికారి పీఎం షేక్ అన్నారు. కటికెనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు న్యా య వాది ఈదుల విక్రంరెడ్డి అందించిన స్పోర్ట్స్ డ్రెస్‌లను శుక్రవారం ఎంపీడీవోతోపాటు జిల్లా మానిటరింగ్ అధికారి పంపిణీ చేశారు. కొత్తూ రులో ఎంఈవో ప్రభాకర్ కంప్యూటర్ ల్యాబ్ వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా ముందుకు సాగుతున్నాయన్నారు. సర్పంచులు భూక్య సంగీత, చేపూరి లచ్చయ్య, ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ నాయక్, వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ బోనగిరి అజయ్, ఎంపీవో రమేశ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సరిత తదితరులు పాల్గొన్నారు.
విలువైనది ప్రాణం
విలువైనది ప్రాణం


