ప్రజల మన్ననలు పొందాలి
ఉపాధి నిబంధనలపై అవగాహన అవసరం కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు ముగిసిన సర్పంచుల ఐదురోజుల శిక్షణ తరగతులు
పెద్దపల్లిరూరల్: పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడేలా సర్పంచులు పాటుపడి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కొత్త సర్పంచులకు స్థానిక మదర్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలలో ఐదురోజులుగా సాగుతున్న శిక్షణ తరగతులు శుక్రవార ముగిశాయి. ఎమ్మెల్యే విజయరమణారావుతో కలి సి కలెక్టర్ సర్పంచులకు ధ్రువీకరణపత్రాలను అందించారు. ఉపాధిహామీ ద్వారా చేపట్టే పనుల విషయంలో నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయని కలెక్టర్ అన్నారు. లేఅవుట్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పల్లెల అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జెడ్పీ సీఈవో నరేందర్, డీఎల్‌పీవో దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.
గడవులోగా ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగఖ
పెద్దపల్లి: జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ను గడువులోగా 100 శాతం పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో శుక్రవారం తన కార్యాలయంలో సమీక్షించారు. కలెక్టర్ మాట్లా డుతూ, పట్టణాల్లో 1,406, రూరల్ ప్రాంతాల్లో 967, జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,373 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈనెల 30వ తేదీవరకు ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోయాలని ఆయన సూచించారు. పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని అన్నారు. లబ్ధిదారులకు బిల్లుల త్వరితగతిన చెల్లింపులు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి నిర్వహించిన మరో సమావేశంలో కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, పరిపాలన అంశాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రతీశాఖలోని జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఖాళీల వివరాలను వెంటనే తనకు సమర్పించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. గణతంత్ర వేడుకల సందేశాన్ని క్లుప్తంగా తయారు చేయాలని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో హౌసింగ్ పీడీ రాజేశ్వర్‌రావు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


