మహిళా వైద్య సిబ్బంది క్రీడా సంబురం
కోల్‌సిటీ(రామగుండం): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) మహిళా వైద్య ఉద్యోగులకు శు క్రవారం క్రీడాపోటీలు నిర్వహించారు. పేషెంట్లకు నిత్యం వైద్య సేవలు అందించే సిబ్బంది.. క్రీడాపోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒత్తిడిని పక్కనపెట్టి క్రీడామైదానంలో సందడి చేశారు. నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ గ్రేడ్–2 టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రత్యేకంగా కబడ్డీ, చైర్ రేస్, స్పూన్–పింగ్ వంటి వినోదాత్మక క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన మహిళా సిబ్బందిని వైద్యాధికారులు అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి, విధుల్లో మరింత నిబద్ధతతో పనిచేయడానికి దోహదపడతాయని వారు తెలిపారు. విజేతలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా బహుమతులను అందజేయనునట్లు వైద్యాధికారులు తెలిపారు.
మహిళా వైద్య సిబ్బంది క్రీడా సంబురం


