సోలార్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి
మంథని/మంథనిరూరల్: జిల్లాలో సహకార సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, ఫిబ్రవరి లోగా గ్రిడ్‌కు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం మంథనిలోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయ పనులు, జెడ్పీహెచ్‌ఎస్ బాలికలు, సంగీత కళాశాల, భట్టుపల్లిలోని ఆర్‌అండ్‌ఆర్ పనులు, మండలంలోని కన్నాల జెడ్పీ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాల, నాగారం ఎంపీపీఎస్, పీహహెచ్‌సీ సబ్‌సెంటర్, గుంజపడుగు గ్రామంలో నిర్మాణంలో ఉన్న పీహెచ్‌సీ భవనం, జెడ్పీహెచ్‌ఎస్ తదితర పనులు పరిశీలించారు. ఆయా పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో పాటు సమాంతరంగా ట్రాన్స్‌మిషన్ లైన్ పనులు కూడా మొదలు పెట్టాలని సూచించారు. ఈ పనులకు డిస్కం అధికారులు సహకరించాలన్నారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో పాటు, సమాంతరంగా విద్యుత్ రవాణా కోసం ట్రాన్స్ మిషన్ లైన్ నిర్మాణ పనులు కూడా రెండు రోజుల్లో మొదలు పెట్టాలని, దీనికి డిస్కం అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. రెడ్కో, విద్యుత్ శాఖలను మంచి సమన్వయం చేస్తున్నారని డీసీవోను అభినందించారు. డీసీవో శ్రీమాల, రెడ్కో జిల్లా మేనేజర్ దురిశెట్టి మనోహర్, కేడీసీసీ బ్యాంకు సీఈవో సత్యనారాయణరావు, ఎంపీడీవో శ్రీజ, తహసీల్దార్ అరీఫోద్దిన్, ఏడీఈ వెంకటనారాయణ పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
పెద్దపల్లి: తెలంగాణ రెవెన్యూ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ 2026 సంవత్సరం క్యాలెండర్‌ను గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తూము రవీందర్, కార్యదర్శి లెంకల బ్రహ్మానందరెడ్డి, ఉపాధ్యక్షులు వై.కుమార్, ఎండీ సాజిద్‌అలీ, డాక్టర్ డి.రాజు, సంయుక్త కార్యదర్శులు గొడిశల శ్రీనివాస్, పల్లాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


