మంథని పీఠం ప్రతిష్టాత్మకం | - | Sakshi
Sakshi News home page

మంథని పీఠం ప్రతిష్టాత్మకం

Jan 23 2026 6:35 AM | Updated on Jan 23 2026 6:35 AM

మంథని

మంథని పీఠం ప్రతిష్టాత్మకం

మంథని: మంథనిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం మంథని కావడంతో మున్సిపల్‌ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు కావడంతో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వార్డుల వారీగా సర్వేలు

జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. రామగుండం ఎస్సీలకు రిజర్వు కాగా మంథని బీసీ జనరల్‌, పెద్దపల్లి బీసీ మహిళ, సుల్తానాబాద్‌ జనరల్‌కు రిజర్వు చేశారు. అయితే మూడు స్థానాల కంటే మంథనిపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ క్రమంలోనే మంథని పీఠం కై వసం కోసం కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలు కన్నేశాయి. ఆయా వార్డుల్లో ప్రజాధారణ ఉన్న అభ్యర్థులు ఎవరు.. గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయి.. పార్టీ బలబలాలు.. కుల, ఽఆర్థిక పరిస్థితులు, ఇతరత్రా అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమచారం. నివేదికల ఆధారంగానే టికెట్ల కేటాయింపు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

ఓటర్ల వద్దకు అశావహులు

మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకపోయినా, టికెట్లు ఖరారు కాకపోయినా అశావహులు మాత్రం అప్పడే ప్రచారం మొదలు పెట్టారు. తాము ఈ వార్డు నుంచి బరిలో ఉంటున్నామని, తమను ఆశీర్వదించాలని వేడుకుంటున్నారు. అవసరమైన హామీలు, వారి అవసరాలు తీర్చే పనిలో నిమగ్నమయ్యారు. కొంత మంది ఏకంగా తామే చైర్మన్‌ అభ్యర్థులమని అడుగు ముందుకు వేసి అతి ఉత్సాహం కనబర్చుతున్నారు. ఏ పార్టీ కూడా ఇప్ప టి వరకు టికెట్లను అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఆశావహులు మాత్రం టికెట్‌ తమకే వస్తుందనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. సొంత పార్టీలో టికెట్‌ రాకుంటే మరో పార్టీ నుంచి పోటీకి సై అని కొందరు ఆశావహులు అంటుండగా, ఇండిపెండెంట్‌గా బరిలో ఉండేందుకు మరికొందరు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

గెలుపు గుర్రాల కోసం అన్వేషణ

వార్డుల వారీగా సర్వేలు.. ప్రజాభిప్రాయ సేకరణ

ఓటర్లకు వద్దకు ఆశావహులు.. వేడెక్కిన రాజకీయం

మంథని పీఠం ప్రతిష్టాత్మకం1
1/1

మంథని పీఠం ప్రతిష్టాత్మకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement