క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందుబాటులోకి తేవాలి | - | Sakshi
Sakshi News home page

క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందుబాటులోకి తేవాలి

Jan 23 2026 6:35 AM | Updated on Jan 23 2026 6:35 AM

క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందుబాటులోకి తేవాలి

క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందుబాటులోకి తేవాలి

● ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌

గోదావరిఖని(రామగుండం): పారిశ్రామిక ప్రాంతంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో క్యాథ్‌ల్యాబ్‌ సేవలు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ కోరారు. గురువారం సింగరేణి ఏరియా హాస్పిటల్‌ను సందర్శించి క్యాథ్‌ల్యాబ్‌ సెంటర్‌ పనులను ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. క్యాథ్‌ల్యాబ్‌ సేవలు ప్రారంభమైతే గుండె సంబంధిత చికిత్సల కోసం రామగుండం పరిసర ప్రాంతాల ప్రజలు కరీంనగర్‌, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మెరుగైన వైద్యం పొందవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా హాస్పిటల్‌కు రెండు ప్రవేశ మార్గాలు ఉండాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. సింగరేణి శ్రీనివాస్‌, సివిల్‌ డీజీఎం వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement